Nagarjuna Sagar: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నది జిల్లాల విభాగం భగ్గుమంది. నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద రీడింగ్ విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం చెలరేగింది. శనివారం ఉదయం సాగర్ కుడి కాలువ వాటర్ లెవల్స్ తీసుకోవడానికి తెలంగాణ అధికారులు వెళ్లారు. దీంతో ఆంధ్ర అధికారులు వారిని అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో విషయాన్ని తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు, కేఆర్ఎంబీ సమాచార గ్రూపులతో పాటు అధికారులకు నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ ఇరిగేషన్ సిబ్బంది సమాచారం అందించారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులను కేఆర్‌ఎంబీ అధికారులు సర్ధిచెప్పారు. కాగా, 2023 నవంబర్‌లో నాగార్జున సాగర్ డ్యామ్‌పై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం తలెత్తడంతో ఏపీ, తెలంగాణ పోలీసులు డ్యామ్‌పై పెద్దఎత్తున మోహరించారు.
డ్యాప్‌పై కంచెలు వేసి ఇరువైపులా భారీగా బలగాలను దించడంతో యుద్ధవాతావరణం నెలకొన్నది. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ నవంబర్‌లోనే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పుడు అప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ ఏపీలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే కొద్ది నెలలకే ఆ పార్టీలు అధికారం కోల్పోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడింది మరి ఇప్పటికైనా ఈ జలవివాదం సర్దుమడుగుతున్నానేది చూడాలి.