Virat Kohli: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. లక్షలాది మంది అభిమానుల కల నెరవేరింది. 18 ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పంజాబ్ కింగ్స్‌పై ఆర్‌సీబీ ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. కప్ గెలిచిన తరువాత కింగ్ కోహ్లీ భావోద్వేగంతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆర్‌సీబీ అభిమానులకు శుభవార్త కూడా ఇచ్చాడు. రిటైర్మెంట్ గురించి కోహ్లీ మాట్లాడుతూ, “నేను ఇంకా చాలా సంవత్సరాలు ఆడే అవకాశం ఉంది. నేను రిటైర్ కావడానికి ఇంకా సమయం ఉంది. నా పూర్తి ఆటను ఇంకా ఆస్వాదిస్తాను.
చివరకు నా ఒడిలో కప్పు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని అన్నాడు. నా హృదయం బెంగళూరుతోనే ఉంది, నా ఆత్మ బెంగళూరుతోనే ఉంది . నేను ఐపీఎల్ ఆడుతున్నంత కాలం నేను ఆడబోయే జట్టు ఇదే. ఈ రాత్రి నేను పసిపాపలా హయిగా నిద్రపోతానని ఆయన భావోద్వేగంతో వెల్లడించాడు. “ఈ విజయం జట్టుకు ఎంత ముఖ్యమో అభిమానులకు కూడా అంతే ముఖ్యం. 18 సంవత్సరాలు అయింది. ఈసారి నేను నా యవ్వనాన్ని మరచిపోయి నా అత్యుత్తమ ఆటను ఇచ్చాను. నా దగ్గర ఉన్నదంతా ఇచ్చాను. ఈ రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. చివరి బంతి వేయగానే నేను భావోద్వేగానికి గురయ్యాను.” అని కోహ్లీ అన్నారు.