Egg Shells: ఆరోగ్యానికి ఎంతో మంచివని అందరికీ తెలిసిందే. అయితే, వీటి వాడకానికి తర్వాత పెంకులను పారేయడం సాధారణంగా మనం చేస్తుంటాం. కానీ, ఈ పెంకులను ఉపయోగించి చర్మాన్ని మెరుగుపర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖంపై మచ్చలు తొలగించేందుకు, చర్మ కాంతిని పెంచేందుకు, మంటను తగ్గించేందుకు గుడ్డు పెంకు పొడి ఉపయోగకరంగా ఉంటుంది.
ముఖం మీద మచ్చల కోసం:
గుడ్డు పెంకులను శుభ్రంగా కడిగి, ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవాలి. ఇందులో తేనె కలిపి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగిస్తే మొటిమల వల్ల ఏర్పడిన నల్ల మచ్చలు తగ్గుతాయి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
చర్మ కాంతి కోసం:
గుడ్డు తెల్లసొనలో గుడ్డు పెంకు పొడిని కలిపి ముఖానికి అప్లై చేసి గంట తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది వారానికి రెండుసార్లు చేయడం మంచిది.
ఇది కూడా చదవండి: H5N1 Virus: ఈ జంతువుల్లోనూ బర్డ్ ఫ్లూ.. ఇన్ఫెక్షన్ తగ్గించడం కష్టంగా మారిందా ?
చర్మంపై మంట తగ్గించేందుకు:
యాపిల్ సైడర్ వెనిగర్, లవంగాల పొడి, గుడ్డు పెంకు పొడిని కలిపి ఐదు రోజులు నానబెట్టి ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా మారటమే కాకుండా మంట తగ్గుతుంది.
మొటిమల మచ్చలు తొలగించేందుకు:
రెండు టేబుల్ స్పూన్ల గుడ్డు పెంకు పొడిలో నిమ్మరసం కలిపి మచ్చలపై అప్లై చేస్తే, అవి తగ్గి ముఖ సౌందర్యం మెరుగవుతుంది. ఈ విధంగా వృథా అవుతున్న గుడ్డు పెంకులను ఉపయోగించి చర్మాన్ని ప్రకృతి సిద్ధంగా సంరక్షించుకోవచ్చు!