Khakee: నెట్ ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ రాబోతుంది. మార్చి 20 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోదా జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా బిహార్ చాప్టర్ రూపొందింది.ఆయన రచించిన ‘బిహార్ డైరీస్’ ఆధారంగా ఈ సిరీస్ వచ్చింది. ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదలై విశేషంగా ఆకట్టుకోవడంతో, దీనికి సీజన్ 2ను రూపొందించారు. ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్’ సీక్వెల్ గా రాబోతుంది. అయితే తాజాగా చిన్న ప్రోమో వదిలారు మూవీ టీం. ఇందులో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. ఇందులో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారని కొన్ని ఫోటోలు కూడా షేర్ అయ్యాయి. తాజాగా వీటిపై క్లారిటీ వచ్చింది. మార్చి 20 నుంచి ఈ సిరీస్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుపుతూ నెట్ ఫ్లెక్స్ ఓ ప్రోమో వీడియో విడుదల చేసింది. అందులో గంగూలీ ఖాకీ దుస్తుల్లో కనిపించారు.
