Narne Nithin: ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన మొదటి చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. అయితే దీనికంటే ముందు అతను నటించిన ‘మ్యాడ్’, ‘ఆయ్’ చిత్రాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ మూడో చిత్రంగా విడుదల కాబోతోంది. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో చింతపల్లి రామారావు నిర్మించిన ఈ సినిమా ఇదే నెల 28న విడుదల కాబోతోంది. ఇటీవలే నార్నే నితిన్ వివాహం నిశ్చితార్థం సైతం ఘనంగా జరిగింది. ఈ శుభ సమయంలో విడుదల కాబోతున్న తమ చిత్రం నితిన్ కు హ్యాట్రిక్ ను అందిస్తుందనే ఆశాభావాన్ని దర్శక, నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎంతో మెచ్చి, ఈ కథను ఎంపిక చేశారని, ఆయన అంచనాలను నిలబెట్టేలా ఈ సినిమాను రూపొందించామని వారు చెప్పారు. ఈ గ్రామీణ నేపథ్య ప్రేమకథా చిత్రానికి కైలాష్ నరేష్ సంగీతం అందించారు.