Bandi sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ సిట్ విచారణ ముగిసింది. దాదాపు గంటపాటు కొనసాగిన విచారణలో బండి సంజయ్ తన వాంగ్మూలాన్ని రికార్డు చేయగా, తన వద్ద ఉన్న ఆధారాలను కూడా సిట్‌కు సమర్పించారు.
బండి సంజయ్ మాట్లాడుతూ—
“కేసీఆర్ ప్రభుత్వ కాలంలో భారీ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అందులో అత్యధికంగా నా ఫోన్‌ను ట్యాప్ చేయడం నాకు షాక్ ఇచ్చింది. కేసీఆర్ కుటుంబం అత్యంత క్రూరమైన ఆలోచనతో వ్యవహరించింది. రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఫోన్‌లను కూడా ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయం గురించి మొదటగా మాట్లాడింది నేనే. అధికారులు చూపించిన వివరాలు చూసి ఆశ్చర్యానికి గురయ్యాను” అని పేర్కొన్నారు.