Beauty Tips: చలికాలంలో చర్మం దాని కాంతిని కోల్పోతుంది. ముఖంపై ముడతలు, నల్లటి మచ్చలు కనిపిస్తాయి. మెరిసే చర్మం కావాలనుకుంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారం చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా శీతాకాలంలో వచ్చే వివిధ చర్మ సమస్యల నుండి రిలీఫ్ కలిగిస్తుంది. చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. చాలా మంది వివిధ ఫేస్ ప్యాక్‌లు, క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు వంటి అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ ఫుడ్‌లో మార్పులు చేసుకుని మెరిసే చర్మాన్ని పొందడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
చిలగడదుంప
ఇందులో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ మూలకం ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా చిలగడదుంపలు సూక్ష్మపోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. అధిక మొత్తంలో ఫైబర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీలు, తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. ఇది చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.
అవకాడో
ఈ పండులో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చలికాలంలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో బాగా పనిచేస్తుంది.
ఇది కూడా చదవండి: Delhi: బుర్ఖా లో వచ్చి దొంగ ఓట్లు వేస్తుర్రు.. బీజేపీ కామెంట్స్..
పాలకూర
ఈ ఆకు కూరలోని యాంటీఆక్సిడెంట్ కంటెంట్ చర్మంపై ముడతలు, సన్నని గీతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించి చర్మానికి మెరుపును ఇస్తుంది. ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా ఒక గ్లాసు పాలకూర రసం తాగడం చాలా మంచిది.
బాదం
బాదంను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముఖంలో కాంతి పెరుగుతుంది. అంతేకాకుండా బాదం నూనెను పూయడం వల్ల చర్మ రంగు మెరుగుపడుతుంది. అంతేకాకుండా దాని ఎమోలియంట్ లక్షణాలు చర్మానికి చాలా మంచివి.
క్యారెట్
ఈ కూరగాయలో బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని UV కిరణాల నుండి రక్షించి, మెరిసేలా చేస్తాయి. కాగా ఇటువంటి ఆహారాలను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.