IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ జూలై 10, గురువారం లండన్‌లోని లార్డ్స్‌లో ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కెప్టెన్ అంచనాలు ఆదిలోనే తలకిందులయ్యాయి. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ వరుసగా 23, 18 పరుగులు చేసి నితీష్ రెడ్డి బౌలింగ్‌లో ఔట్ అయ్యారు. ఓలీ పోప్‌తో జతకట్టిన జో రూట్ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు.
2 వికెట్లకు 43 పరుగులతో కష్టాల్లో పడిన జట్టును జో రూట్ఆదుకున్నాడు. భారత బౌలింగ్ దాడిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు మరియు అర్ధ సెంచరీతో పుంజుకుంటున్నాడు. ఈ సమయంలో రూట్ భారత్ పై టెస్ట్ క్రికెట్‌లో ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మన్ సాధించని రికార్డును సృష్టించాడు.
రూట్ తన అర్ధ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. భారత్‌పై టెస్ట్ మ్యాచ్‌లలో 3000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ మైలురాయిని సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు. గత ఏడాది ఇంగ్లాండ్ భారత పర్యటనలో అతను భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన రికీ పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టాడు.
మొత్తం మీద, టెస్ట్ క్రికెట్‌లో ఒకే ప్రత్యర్థిపై 3000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచంలో తొమ్మిదవ ఆటగాడిగా రూట్ నిలిచాడు. దీనికి ముందు, ఇంగ్లాండ్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ జాక్ హాబ్స్ , డేవిడ్ గోవర్ మాత్రమే ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించారు. ఈ ఇద్దరి తర్వాత అలా చేసిన మూడవ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌గా అతను నిలిచాడు.