Pakistan

Hyderabad: హైదరాబాద్ బ్యాంకాక్ విమానానికి బాంబు బెదిరింపు

Hyderabad : హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. హైదరాబాద్‌ నుంచి బ్యాంకాక్‌ వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, అతనిని, లగేజీని తనిఖీ చేశారు.

ఆ సమయంలో విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. మొదట వారిని కిందకు దించారు. విమానాన్ని ఐసోలేషన్‌ ప్రాంత్రానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబూ లేదని తేల్చారు. నిన్న నాగపూర్ విమానానికి కూడా ఓ బాంబు బెదిరింపు వచ్చింది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *