Deepika Padukone

Deepika Padukone: ‘కంగువ -2’ లో దీపికా పదుకొనే ఉండదు

Deepika Padukone: నవంబర్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘కంగువ’కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, కలెక్షన్స్ సంతృప్తి కరంగా ఉన్నాయని నిర్మాతల్లో ఒకరైన కెఇ జ్ఞానవేల్ రాజా తెలిపారు. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు మంచి గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు. అయితే ‘కంగువ -2’లో దీపికా పదుకొనే ను నాయికగా తీసుకుంటున్నామని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన చెప్పారు. సీక్వెల్ వర్క్ ఇంకా మొదలు కాలేదని, దర్శకుడు శివ అజిత్ తో ఓ సినిమా పూర్తి చేయాల్సి ఉందని, ఆ తర్వాతే ‘కంగువ -2’ మీద వర్క్ చేస్తామని తెలిపారు. కార్తీతో తాను ప్రస్తుతం నిర్మిస్తున్న ‘వా వాతియర్’ మూవీ రిలీజ్ జనవరి చివరిలో లేదా ఫిబ్రవరిలో ఉంటుందన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Biden Diwali Celebrations: అమెరికా అధ్యక్ష భవనంలో దీపావళి సంబరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *