Diamond Hunting

Diamond Hunting: కటిక పేదరికం.. రాత్రి రాత్రికే లక్షాధికారులు అయిపోయారు ఎలాగో తెలుసా?

Diamond Hunting: పాతకాలం సినిమాలో కుటుంబ సమస్యలు పేదరికం చూపించాలి అంటే హీరోకి ఇద్దరు చెల్లెలు ఉంటారు వారికీ పెళ్లిలుచేయడానికి పడే కష్టాలు చూపిస్తారు.. ఇప్పటికి ఇద్దరి చెల్లెలా పెళ్లిలు చేయడానికి కష్టపడే కుటుంబాలు ఉన్నాయి. అలంటి కుటుంబానికి చెందిన వ్వక్తికి రాత్రికి రాత్రే అదృష్ట్రం కలిసొస్తే అంది అంత సినిమాలోనే అవుద్ది నిజజీవితంలో కాదు అంటారు. కానీ జరిగితే అదికూడా ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 50లక్షలు దక్కితే దానికి మించిన ఆనందం ఉండదు. అలాంటి ఘటనే ఒక్కటి జరిగింది.

వివరాలోకి వెళ్తే..

మధ్య ప్రదేశ్ లోని పన్నా జిల్లాకు చెందిన సతీష్, సాజిద్ అనే ఇద్దరు ప్రాణస్నేహితులు ఉన్నారు. ఇద్దరి కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడిన వారే. ఇందులో సతీష్ మటన్ షాపు నడుపుతున్నాడు. సాజిద్ పండ్ల అమ్ముతూ కలం గడిపేవారు. ఎంత కష్ట పడిన వచ్చిన డబ్బులు సరిపోకపోయేవి దింతో సాజిద్ కి ఓ ఐడియా వచ్చింది. తన త్రండ్రి తాత ఇద్దరు వజ్రాల వేట సాగించేవారు కానీ కలం కలిసిరాక ఒక్క వజ్రం కూడా దొరకలేదు. వజ్రాల వేట గురించి స్నేహితుడు సతీష్ కి చెప్పిగా ఇంతకంటే ఆర్థికంగా వెనక్కి వేళేది లేదుకాబట్టి సాజిద్ తో కలిసి వేటకి ఒప్పుకున్నాడు. దింతో ఇద్దరు కలిసి 20రోజుల కిందట ఓ చిన్న గనిని లీజ్‌కు తీసుకుని తవ్వకాలు ప్రారంభించారు.

ఫలితం ఆశించకుండా పనిచేస్తే ఫలితం దక్కుతుంది అన్నట్టుగానే తవ్వకాలు జరుపుతున్న సమయంలో మెరుస్తున్న ఒక రాయి వారికీ కనిపించింది. దానిని తీసుకోని దగ్గరలో ఉన్న డైమండ్ అధికారికి అప్పగించారు. దాన్ని పరిశీలించిన అధికారులు అది 15.34 క్యారెట్ల నాణ్యమైన వజ్రమని నిర్ధారించారు. త్వరలో వజ్రాన్ని వేలం వేసి అందులో వచ్చిన డబ్బుని ఇద్దరి మిత్రులకి ఇష్టం అని చెప్పారు. ఈ మాటలు విన్న ఇద్దరి ఆనదంకి అవధులు లేవు.

వచ్చిన డబ్బులను సమానంగా పంచుకోనున్నారు ఇద్దరు మిత్రులు. వచ్చిన డబ్బులతో ముందుగా ఇద్దరి చెల్లెల పెళ్లిళ్లు చేసి తరువాత మిగిలిన డబ్బులతో ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడతాం అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *