BalaKrishna: రవి తేజతో మిస్టర్ బచ్చన్ తీసి డిజాస్టర్ అందుకున్నాడు హరీష్ శంకర్. దీంతో హిట్ కోసం తన తరువాతి సినిమాని బాలయ్యతో తియ్యాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే బాలయ్య అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బాబీ లాంటి యంగ్ దర్శకులకు ఛాన్స్ ఇచ్చాడు.
తాజాగా హరీష్ శంకర్ కి ఛాన్స్ ఇచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి.బాలయ్యతో బంపర్ హిట్ ఇవ్వగలగడం హరీష్ శంకర్ కు సాధ్యపడుతుంది. నిజానికి ఈ కాంబోపై ఇప్పుడే అధికారికంగా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. కానీ రూమర్స్ మాత్రం ఊపందుకున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ముందుకొచ్చినట్టు సమాచారం.
Also Read: Tamannah: షాకిస్తున్న తమన్నా బాలీవుడ్ లైనప్!
BalaKrishna: బాలయ్య ప్రస్తుతం ‘అఖండ-2’ పనుల్లో ఉండగా, ఆ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే హరీష్ సినిమా పట్టాలెక్కే అవకాశముందని టాక్. హరీష్ కూడా ఈలోపు బాలయ్య కోసం మంచి స్టోరీని రాసుకునేందుకు రెడీ అవుతున్నాడట. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.