Ankith Koyya: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో బాగా వినిపించిన పేరు అంకిత్ కొయ్య. హీరో స్నేహితుడిగా కొన్ని సినిమాలలో నటించిన అంకిత్ మరికొన్ని వెబ్ సీరిస్ లలో కీలక పాత్రలు పోషించాడు. తాజాగా ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ అనే చిత్రంలో హీరోగా నటించాడు. శ్రియా కొంతం హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శ్రీహర్ష డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా స్నీక్ పీక్ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత సత్య మాట్లాడుతూ, సెన్సిబుల్ మెసేజ్ తో తెరకెక్కిన వినోదాత్మకం చిత్రమిద’ని అన్నారు. అమృతం సీరియల్ ను ఎంజాయ్ చేసినట్టే ఈ సినిమాను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయొచ్చని అంకిత్ కొయ్య అన్నారు. హర్ష అనే కారెక్టర్ తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన తరువాత డోర్ లాక్ అవ్వడం, ఇంట్లోనే పద్నాలుగు రోజులు ఉండటంతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది ఈ సినిమా కథ అని చెప్పారు.
