పార్టీ ఫిరాయింపుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. పార్టీ మార్చలేదని చెబుతూ కండువా కప్పుకోవడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు.
“పార్టీ మార్చకపోతే కండువా ఎందుకు కప్పుకున్నారు? కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు మీటింగ్లో పాల్గొనలేదా? నిజం చెప్పాలంటే మిమ్మల్నే నిలదీయాలి” అని హరీష్ రావు మండిపడ్డారు.
కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై రేవంత్ వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.