Tea and Cigarette: ధూమపానం ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మోకింగ్ చేయడం వల్ల ఎన్నో రకాల రోగాలు వస్తాయని నిపుణులు సైతం చెబుతుంటారు. హార్ట్ ఎటాక్ మొదలు, ఊపిరితిత్తులు, లివర్ సమస్యల వరకు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు స్మోకింగ్ కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే స్మోకింగ్ అలవాటును పూర్తిగా మానేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.
ఇక స్మోకింగ్ చేసే వారి పక్కన ఉండే వారిలో కూడా అనారోగ్య సమస్యలు తప్పవని చెబుతుంటారు. పాసివ్ స్మోకర్స్‌లో ఆరోగ్య సమ్యలు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని అంటుంటారు. అయితే కొందరు స్టైల్ కోసం సిగరెట్ అలవాటు చేసుకునే వారు కూడా ఉంటారు. ముఖ్యంగా టీ తాగే సమయంలో ఓ చేత్తో టీ, మరో చేత్తో సిగరెట్ పట్టుకొని పొగను స్టైల్‌గా వదులుతుంటారు.
అయితే ఏదో స్టైల్‌గా మొదలైన ఈ అలవాటు మీ ప్రాణాలనే తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసలు స్మోకింగ్ చేయడమే ఆరోగ్యానికి ఇబ్బందికరమంటే టీ తాగుతూ స్మోకింగ్ చేయడం మరింత డేంజర్ అని అంటున్నారు. టీతోపాగు సిగరెట్ తాగే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30 శాతం అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
టీలో ఉండే టాక్సిన్లు, సిగరెట్ పొగతో కలిస్తే అది క్యాన్సర్‌కు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా ఈ అలవాటు ఉన్న వారిలో కడుపులో పుండ్లు, జీర్ణ సంబంధిత సమస్యలు, ఊపిరిత్తులు కుచించుకుపోవడం, సంతానలేమి సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు రావడం వంటి సమస్యలు వెంటాడుతాయనిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.