Manmohan Singh: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఈరోజు ఉదయం 11:45 గంటలకు ఢిల్లీలోని నికంబోత్ ఘాట్‌లో 21 తుపాకీ మోతలతో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
నేడు AICC కార్యాలయానికి మన్మోహన్ పార్థివదేహంని తీసుకోని రానున్నారు. ప్రజల సందర్శనార్థం ఉదయం 8 నుంచి ఉ.10 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. అనంతరం AICC ఆఫీస్ నుంచి మన్మోహన్‌సింగ్ అంతిమయాత్ర. ఉదయం 11:45కు ఢిల్లీ రాజ్‌ఘాట్ సమీపంలో యమునా నది ఒడ్డున నిగాంబోధ్ ఘాట్ దగ్గర మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Manmohan Singh Biography: రాజీవ్ గాంధీ జోకర్ అన్నారు.. నిశ్శబ్ధ యోధుడిగా ప్రధాని అయ్యారు!
Manmohan Singh: ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రబుపతి ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు తదితరులు పాల్గొంటారని సమాచారం. కాగా, మన్మోహన్ సింగ్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి లేఖ రాశారు.