Manmohan Singh Biography: మన్మోహన్ సింగ్.. భారత దేశ ప్రధానిగా పదేళ్ల పాటు నిశ్శబ్ద యోధుడిలా పనిచేశారు. పెదవి విప్పకుండానే చేయాలనుకున్న పనిని పూర్తి చేసేవారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్లో దాదాపు సగానికి పైగా మన్మోహన్ నాయకత్వాన్ని ఇష్టపడలేదు. వారిలో ఎవరూ కూడా మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా కొనసాగాలని కోరుకోలేదు. కానీ, అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆయనను ప్రధానిగా నియమించారు. కానీ, మన్మోహన్ ప్రభుత్వ అధినేత అయినా.. నిజమైన పగ్గాలు మాత్రం సోనియా గాంధీ దగ్గరే ఉండేవనేది జగమెరిగిన సత్యం. మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆయన దేశ ప్రధానిగా.. ఒక పార్టీ విధేయుడిగా కత్తిమీద సాములా ఎలా ప్రభుత్వాన్ని నడిపించారో అర్ధం అవుతుంది.
మన్మోహన్ బాల్యం.. చదువు.. ఉద్యోగం..
డాక్టర్ మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932న బ్రిటిష్ ఇండియాలోని (ప్రస్తుత పాకిస్తాన్) పంజాబ్‌లోని గాహ్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి పేరు అమృత్ కౌర్ – తండ్రి పేరు గురుముఖ్ సింగ్. దేశ విభజన తర్వాత సింగ్ కుటుంబం భారత్‌కు వచ్చేసింది. .
మన్మోహన్ సింగ్ 1952లో ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని, 1954లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పొందారు. దీని తర్వాత ఆయన 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, 1962లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు.
చదువు పూర్తయిన తర్వాత, మన్మోహన్ సింగ్ 1966-1969 మధ్యకాలంలో ఐక్యరాజ్యసమితిలో పనిచేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆఫర్ రావడంతో దేశానికి వచ్చి ప్రొఫెసర్ అయ్యారు.
లలిత్ నారాయణ్ మిశ్రా వాణిజ్య మంత్రిత్వ శాఖలో సలహాదారుగా ఉద్యోగం ఇవ్వడంతో మన్మోహన్ సింగ్ బ్యూరోక్రాటిక్ కెరీర్ ప్రారంభమైంది. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ విదేశీ వాణిజ్య విషయాలపై తన కంటే ఎక్కువ తెలిసిన వారు భారతదేశంలో లేరని బహిరంగంగా చెప్పేవారు.
మంత్రితో ఛాలెంజ్..
ఒకసారి ఆయన తన మంత్రి లలిత్ నారాయణ్ సింగ్‌తో విభేదించారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్‌గా మళ్లీ ఉద్యోగంలోకి వస్తానని మన్మోహన్ సింగ్ చెప్పారు. ప్రధాని ఇందిరాగాంధీ కార్యదర్శి పీఎన్ హక్సర్ ఈ విషయాన్ని కొట్టిపారేశారు. అయితే, మన్మోహన్ సింగ్‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారు పదవిని ఆయన ‘ఆఫర్’ చేశారు. ఈ విధంగా మంత్రితో గొడవ ఆయనకు ప్రమోషన్ తెచ్చిపెట్టింది.
మన్మోహన్ సింగ్ 1970, 1980 లలో భారత ప్రభుత్వంలో ముఖ్యమైన పదవులను నిర్వహించారు. అతను 1972-76 మధ్య ప్రధాన ఆర్థిక సలహాదారుగా, 1982-85 మధ్య రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, 1985-87 వరకు ప్రణాళికా సంఘం అధిపతిగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత..
రాజీవ్ మన్మోహన్ సింగ్ ‘జోకర్’ అని పిలిచినప్పుడు
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పటి కథ ఇది. రాజీవ్ గాంధీ పట్టణీకరణ విషయంలో పట్టుదలగా ఉండేవారు. పట్టణాల అభివృద్ధి.. పెద్ద రోడ్లు.. ఇలా ఆయన ఆలోచనలన్నీ పట్టణాల చుట్టూ తిరిగేవి. ఈ నేపథ్యంలో 1985 నుండి 1990 వరకు పంచవర్ష ప్రణాళిక కోసం ఒక సమావేశం జరిగింది. ఆ సమయంలో ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ మన్మోహన్ సింగ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే, మన్మోహన్ దృష్టి అంతా గ్రామాల అభివృద్ధి.. పేదల వైపు ఉండేది. దీంతో అయన ప్రెజెంటేషన్ కూడా ఆ దిశలోనే సాగింది. అంటే పూర్తిగా రాజీవ్ గాంధీ ఆలోచనలకూ వ్యతిరేక దిశలో మన్మోహన్ ప్రెజంటేషన్ ఉంది. దీంతో రాజీవ్ గాంధీకి కోపం వచ్చింది. అందరి ముందు మన్మోహన్‌ను తిట్టారు. ఆ మరుసటి రోజే రాజీవ్‌ని ప్లానింగ్ కమిషన్ గురించి విలేకరులు ప్రశ్నించగా.. అది ‘జోకర్ల గుంపు’ అని రాజీవ్ అన్నారు.
కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి సి.జి. సోమయ్య అప్పట్లో ప్లానింగ్ కమిషన్ సభ్యుడుగ ఉన్నారు. ఆయన తన జీవిత చరిత్ర ‘ది హానెస్ట్ ఆల్వేస్ స్టాండ్ ఎలోన్’లో ఈ సంఘటన గురించి ఇలా రాశారు.
“నేను మన్మోహన్‌తో కూర్చున్నాను. అవమానం తర్వాత, అతను ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. తొందరపడి రాజీనామా చేస్తే దేశానికి నష్టం వాటిల్లుతుందని చెప్పాను. దీంతో ఎన్ని అవమానాలు చవిచూసినా మన్మోహన్ పదవిలో కొనసాగారు.”
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధాని పదవి కోసం వెతుకుతున్నప్పుడు అదే జోకర్ల గుంపులోని మన్మోహన్ సింగ్‌ను ఎన్నుకున్నారు. ఇది కదా డెస్టినీ అంటే.
ఇది కూడా చదవండి: Manmohan Singh Passes Away: మాజీ ప్రధాని మృతికి వారం రోజుల సంతాపం ప్రకటించిన కేంద్రం..
కోరుకోని పదవి..
Manmohan Singh Biography: 2004లో అటల్ బిహారీ ప్రభుత్వం ‘షైనింగ్ ఇండియా’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగింది. 2004 మే 13న ఫలితాలు వచ్చినప్పుడు, ఓటర్లు దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. అధికార పగ్గాలు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ చేతుల్లోకి వెళ్లాయి. ఆ సమయంలో సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఆమె ప్రధాని అవుతారనే అందరికీ నమ్మకం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా కూడా సోనియా ప్రధాని కావాలని బలంగా కోరుకున్నారు. అయితే, విపక్షాల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. సోనియా గాంధీ ప్రధాని కాకూడదని విపరీతమైన ప్రచారం జరిగింది. సుష్మాస్వరాజ్ లాంటి బీజేపీ నేత సోనియా ప్రధాని అయితే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఇలా ఎందరో సోనియా ప్రధాని కాకూడదనే కోరుకున్నారు. బయట నుంచే కాదు.. ఇంటి నుంచి కూడా సోనియా ప్రధానిగా ఉండకూడదనే బలమైన వాదన వచ్చింది. రాహుల్ గాంధీ సోనియా ప్రధాని కాకూడదని కోరుకున్నారని ప్రచారం జరిగింది. తన తండ్రి, నానమ్మల లానే సోనియాను కూడా చంపేస్తారేమో అని రాహుల్ గాంధీ భయపడ్డారని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు చెప్పారు. అందుకే ఆమె ప్రధాని కావడానికి రాహుల్ ససేమిరా ఒప్పుకోలేదు.
మరోవైపు ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశేశారు అధికారులు. సోనియా పేరుతొ ప్రమాణ స్వీకర పత్రం కూడా సిద్ధం చేసేశారు. అయితే, సోనియా గాంధీ 18 మే 2004 తెల్లవారుజామున నిద్రలేచారు. రాహుల్, ప్రియాంకతో కలిసి ఆమె నిశ్శబ్దంగా ఇంటి నుంచి రాజీవ్ గాంధీ సమాధి వద్దకు చేరుకున్నారు. ముగ్గురూ కొంత సేపు సమాధి ముందు కూర్చున్నారు. ఆ తరువాత అదే రోజు సాయంత్రం 7 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కాంగ్రెస్ ఎంపీల సమావేశం జరిగింది. సోనియా గాంధీ రాహుల్,ప్రియాంక వైపు చూస్తూ ఇలా అన్నారు – “నా లక్ష్యం ఎప్పుడూ ప్రధాని కావడమే కాదు. నేనెప్పుడూ ఆ పరిస్థితి వస్తే నా మనస్సాక్షి మాట వింటానని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఈ రోజు నేను ఈ పోస్ట్‌ను చాలా వినయంతో అంగీకరించకూడదని నిర్ణయించుకున్నాను”
అంతే.. ఒక్కసారిగా కలకలం రేగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ షాక్ అయ్యారు. సోనియా ప్రధాని కాకపోతే ఎవరు ఆ పదవిని దక్కించుకుంటారు అనే చర్చ మొదలైంది. చాలా పేర్లు తెరమీదకు వచ్చాయి. చాలామంది కాంగ్రెస్ ఉద్ధండులు ప్రధాని పదవి తమకు దక్కాలని కోరుకున్నారు. కానీ, అనూహ్యంగా సోనియా నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి పదవికి మన్మోహన్ సింగ్ పేరును ప్రకటించారు. ఇదంతా చివరి క్షణాల్లో జరిగింది. ఈ విషయాన్ని అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా తన ‘టర్నింగ్ పాయింట్స్: ఎ జర్నీ త్రూ ఛాలెంజెస్’లో ప్రస్తావించారు. యూపీఏ విజయం తర్వాత రాష్ట్రపతి భవన్ కూడా సోనియాగాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు లేఖను సిద్ధం చేసిందని, అయితే సోనియా గాంధీ తనను చివరి క్షణంలో కలిసి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు ముందు పెట్టడంతో ఆశ్చర్యపోయానని కలాం పేర్కొన్నారు. దీంతో తర్వాత మళ్లీ లేఖ సిద్ధం చేయాల్సి వచ్చిందని ఆయన తన పుస్తకంలో రాశారు.
అలా అనుకోని పరిస్థితుల్లో ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ తన పదవీకాలం అంతా కూడా విపక్షాల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. స్వపక్షం నుంచి కూడా ఆయనకు సరైన సపోర్ట్ దక్కలేదన్నది నిజం. చుట్టూ సోనియా భజనపరుల ముళ్లను భరిస్తూ.. తనదైన మర్యాదపూర్వక స్టైల్ లో పదేళ్ల పాటు ప్రధానిగా దేశ ప్రజలకు దిశా నిర్దేశం చేశారు మన్మోహన్ సింగ్. చరిత్ర పుటల్లో కాంగ్రెస్ పార్టీలో గాంధీయేతర ప్రధానిగా పదేళ్లు పనిచేసిన ఘనతను లిఖించిన మన్మోహన్ సింగ్ భారతదేశ రాజకీయ చరిత్రలోనూ తనదైన పేజీలను హుందాగా కనిపించేలా చేసుకున్నారు.
html,
body,
body *,
html body *,
html body.ds *,
html body div *,
html body span *,
html body p *,
html body h1 *,
html body h2 *,
html body h3 *,
html body h4 *,
html body h5 *,
html body h5 *,
html body h5 *,
html
body
*:not(input):not(textarea):not([contenteditable=””]):not(
[contenteditable=”true”]
) {
user-select: text !important;
pointer-events: initial !important;
}
html body *:not(input):not(textarea)::selection,
body *:not(input):not(textarea)::selection,
html body div *:not(input):not(textarea)::selection,
html body span *:not(input):not(textarea)::selection,
html body p *:not(input):not(textarea)::selection,
html body h1 *:not(input):not(textarea)::selection,
html body h2 *:not(input):not(textarea)::selection,
html body h3 *:not(input):not(textarea)::selection,
html body h4 *:not(input):not(textarea)::selection,
html body h5 *:not(input):not(textarea)::selection {
background-color: #3297fd !important;
color: #ffffff !important;
}
/* linkedin */
/* squize */
.www_linkedin_com
.sa-assessment-flow__card.sa-assessment-quiz
.sa-assessment-quiz__scroll-content
.sa-assessment-quiz__response
.sa-question-multichoice__item.sa-question-basic-multichoice__item
.sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view {
width: 40px;
}
/*linkedin*/
/*instagram*/
/*wall*/
.www_instagram_com ._aagw {
display: none;
}
/*developer.box.com*/
.bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible):before {
display: none;
}
/*telegram*/
.web_telegram_org .emoji-animation-container {
display: none;
}
/*ladno_ru*/
.ladno_ru [style*=”position: absolute; left: 0; right: 0; top: 0; bottom: 0;”] {
display: none !important;
}
/*mycomfyshoes.fr */
.mycomfyshoes_fr #fader.fade-out {
display: none !important;
}
/*www_mindmeister_com*/
.www_mindmeister_com .kr-view {
z-index: -1 !important;
}
/*www_newvision_co_ug*/
.www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {
z-index: -1 !important;
}
/*derstarih_com*/
.derstarih_com .bs-sks {
z-index: -1;
}