Gold And Silver Prices Today: బంగారం అంటే అందరికీ ఏంటో ఆసక్తి. మహిళలు అనే కాదు పురుషుల్లోనూ బంగారంపై ఎంతో ఇష్టం ఉంటుంది. అందులోనూ మన దేశంలో బంగారం విషయంలో ఉండే ఆకర్షణ వేరే లెవెల్ లో ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్లు.. ఏ శుభకార్యానికైనా కొద్దిపాటి బంగారం కొనాలని అందరూ తహతహ లాడతారు. అంతేకాదు బంగారం మంచి పెట్టుబడి సాధనంగా కూడా ఉంటుంది. కాస్త బంగారం కొనిపెట్టుకుంటే అవసరంలో ఆడుకుంటుంది అనే వారి నుంచి బంగారం కొని.. అమ్మడం వంటివి చేస్తూ దాని వ్యాపారంగా చూసేవారి వరకూ బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
అయితే, బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. మారిపోయే బంగారం ధరలను చెక్ చేసుకోవడం కూడా మనలో చాలామందికి ఇంట్రెస్టింగ్ విషయం బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా వచ్చే మార్పుల నుంచి.. స్థానికంగా ఉండే డిమాండ్.. టాక్స్ ల ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయి. అలాగే మన దేశంలో ప్రాంతాలను బట్టి కూడా బంగారం ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
అంతర్జాతీయంగా బంగారం ధరల్లో ఈరోజు అంటే 28.12.2024న తగ్గుదల కనిపిస్తోంది. ఆ ప్రభావం మన దేశంలో కనిపించడం లేదు. వరుసగా మూడో రోజూ బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు కూడా పది గ్రాములకు 270 రూపాయల పెరుగుదల నమోదు అయింది. హైదరాబాద్ లో కూడా బంగారం ధరలు అదే స్థాయిలో పెరిగాయి. ఈరోజు అంటే 28.12.2024న హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాముల ధర 250 రూపాయలు పెరిగి 71,500రూపాయలుగా ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 270 రూపాయలు పెరిగి 78,000 రూపాయల వద్ద నిలిచింది.
ఇది కూడా చదవండి: Today Horoscope: ఈ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి.. మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే
Gold And Silver Prices Today: ఇక హైదరాబాద్ లో వెండి విషయానికి వస్తే వెండి ధరలు మారలేదు. కేజీ వెండి ఎటువంటి మార్పు లేకుండా 1,00,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.
మన తెలుగురాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల విషయానికి వస్తే, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో కూడా బంగారం, వెండి ధరలు కాస్త అటూ ఇటూగా ఇలానే ఉన్నాయి.
అదేవిధంగా దేశరాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకు 250 రూపాయలు పెరుగుదల నమోదు అయి 71,650 రూపాయలుగా ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 270 రూపాయలు పెరిగింది. 78,150 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే వెండి ధరల విషయానికి వస్తే కేజీ వెండి ఢిల్లీలో కూడా మార్పులు లేకుండా 92,500 రూపాయల వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయంగా చూసుకుంటే భారీగా పెరుగుదల కనబరిచిన బంగారం ధరలు తగ్గుదల బాటలో పడ్డాయి. ఈరోజు అంటే 28.12.2024 ఉదయం 6 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు పది గ్రాములకు 260 రూపాయల తరుగుదల కనబరుస్తోంది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 71,970 రూపాయలుగా ఉంది. అదేవిధంగా వెండి ధరలు కూడా భారీ తగ్గుదల నమోదు చేస్తున్నాయి. కేజీ వెండి ధర 925 రూపాయలకు దిగువన ట్రేడ్ అవుతోంది. దీంతో కేజీ వెండి ధర 80,600కు దిగివచ్చింది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన బంగారం ధరలు ఈరోజు అంటే 28.12.2024 ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా వచ్చే మార్పులు, స్థానికంగా ఉండే డిమాండ్, స్థానిక పన్నులు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. బంగారం, వెండి కొనాలని అనుకునేటప్పుడు మీ ప్రాంతంలో రెండు మూడు దుకాణాల్లో వెరిఫై చేసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా మహాన్యూస్ సూచిస్తోంది