Directors

Directors: ఇండియాలో రిచెస్ట్ డైరెక్టర్స్!

Directors: బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్, హిట్ చిత్రాలను అందిస్తున్న డైరక్టర్స్ ఎందరో మన భారతీయ చిత్రపరిశ్రమలో ఉన్నారు. సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకూ వీరిలో పలువురు అంతర్జాతీయంగానూ పేరే ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. వీరిలో బాగా డబ్బున్న డైరక్టర్స్ మాత్రం కొంత మందే. ధనికులైన టాప్ డైరక్టర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ లో 1500 కోట్లకు పైగా ఆస్థులతో కరణ్ జోహార్ ది తొలి స్థానం. దర్శకుడుగానే కాదు, రియాలిటీ షోస్ తో అందరినీ ఆకట్టుకునే ఇతగాడు నిర్మాతగానూ పలు బ్లాక్ బస్టర్స్ తీశాడు. పంపిణీదారుడుగా, రియల్ వెంచర్స్ తో పాటు పలు వ్యాపారాల్లో భాగస్వామి అయిన కరణ్ ఉత్తరాది, దక్షిణాది అని లేకుండా టాప్ స్టార్స్ అందరితో పని చేశాడు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్, దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ భేటీ!

Directors: ఇక తీసింది కొన్ని సినిమాలైనా ఈ లిస్ట్ లో 1300 కోట్ల సంపాదనతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. కళాత్మక చిత్రాలకు మారుపేరైనా సంజయ్ లీలా భన్సాలీ 950 కోట్లతో మూడో స్థానంలో ఉండగా, డార్క్ అండ్ బోల్డ్ చిత్రాల దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ 850 కోట్ల నికర ఆస్థులతో నాలుగో ప్లేస్ లోనూ, రచయిత గుల్జార్ కుమార్తె, దర్శకురాలు మేఘనా గుల్జార్ 830కోట్ల సంపదతో ఐదో స్థానంలో ఉన్నారు. కబీర్ ఖాన్ 400 కోట్లతో, రోహిత్ శెట్టి 340 కోట్లతో, అనురాగ్ బసు 330 కోట్లతో తర్వాతి స్థానల్లో ఉండగా, టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి 160 కోట్ల నికర ఆస్తులు కలిగి ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *