Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ తో నిర్మాత దిల్ రాజు సోమవారం భేటీ అయ్యారు. ఇటీవల విజయవాడలో ‘గేమ్ ఛేంజర్’ భారీ కటౌట్ ను ఆవిష్కరణ లో పాల్గొన్న అనంతరం సినిమా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నట్లు తెలియచేశాడు దిల్ రాజు. అందులో భాగంగా ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎపిలో నిర్వహించాలని భావిస్తున్నానన్నారు. అంతే కాదు ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని పవన్ కళ్యాణ్ కు కోరారు దిల్ రాజు.
ఇది కూడా చదవండి: Heroines: పారితోషికంలో వీరే టాప్ హీరోయిన్స్!
Pawan Kalyan: పవన్ సైతం ఈవెంట్ కు రావటానికి అంగీకరించినట్లు తెలిసింది. ఇక ఈ భేటీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి కూడా వీరిమధ్య చర్చ జరిగింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ 4,5 తేదీల్లో జరగనుంది. సినిమాను జనవరి 10న విడుదల చేయనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం హైలైట్ కానుందంటున్నారు.