Adilabad

Adilabad: బీఆర్ఎస్‌లో స్తబ్దత. నిరాశలో గులాబీ నేతలు

Adilabad: ఓ వైపు పార్టీ అధినాయకులపై కేసులు నమోదవుతుండటం, స్థానికంగా పార్టీని ముందుకు నడిపించాల్సిన నేతలు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం జిల్లాలో బీఆర్ఎస్ నేతలను కలవరపరుస్తోంది. ఉద్యమ సమయంలో ఉవ్వెత్తున లేచిన నాటి టీఆర్ఎస్ పరిస్థితులు ప్రస్తుతం అందుకు భిన్నంగా తయారవుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, తదనంతరం జరిగిన పరిణామాలు జిల్లా పార్టీపై తీవ్ర ప్రభావాన్నే చూపించాయి. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ కూతురు కవిత జైలు కెళ్ళి రావడం, కేసీఆర్ ఫాంహౌస్‌కి పరిమితం కావడం, పార్టీని ముందుకు నడిపిస్తారని భావించిన కేటిఆర్‌పైన ఇప్పుడు కేసు నమోదు కావడం వంటి అంశాలు పార్టీ క్యాడర్‌ను కకావికలం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే తరుణంలో జిల్లాలోని బీఆర్ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ల్లోకి వెళ్లడంతో ఆ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి.

Adilabad: లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్‌లో చేరడానికి ఆ పార్టీ నేతల తీరే కారణమనే అభిప్రాయాలు ఆ పార్టీ కింది స్థాయి కార్యకర్తలు, నేతలు నుంచి వ్యక్తమవుతున్నాయి. దీనిపై పార్టీ అధిష్ఠానానికి అనేక ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో రెండు స్థానాల్లో గెలుపొందిన బీఆర్‌ఎస్‌… పార్లమెంట్ ఎన్నికల నాటికి అత్యంత దయనీయ స్థితికి చేరి మూడో స్థానానికి పరిమితమైంది. పార్టీ బరిలో దింపిన అభ్యర్థి ఆత్రం సక్కు రాజకీయాలతో పాటు వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్నప్పటికీ మూడో స్థానానికి పడిపోవడం..

ఇది కూడా చదవండి: Directors: ఇండియాలో రిచెస్ట్ డైరెక్టర్స్!

Adilabad: అందులోనూ ఓట్లు ఆశించిన స్థాయిలో పార్టీకి పోల్ కాకపోవడంతో అధిష్ఠానం ఆరా తీసినట్లు తెలిసింది.పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధిష్టానం భారీగానే ఫండింగ్ చేసిందని.ఆ డబ్బులు క్షేత్రస్థాయిలో కార్యకర్తల దాకా అందకపోవడం వెనుక భారీగా చేతివాటం జరిగిందన్న ఆరోపణలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి.అలాగే పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే మూడు నియోజకవర్గాలలోను ఇదే విధమైన పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గ ఇన్‌ఛార్జీల మార్పు జరగనుందనే ప్రచారం మొదలైంది.

Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో బోథ్, అసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మీలు కొనసాగుతున్నారు. మిగితా 8 చోట్ల పార్టీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లుగా మాజీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు.అందులో పార్టీ కార్యక్రమాలు చురుకుగా కొనసాగిస్తున్నది కొందరే… అందులో ఆదిలాబాద్‌లో జోగు రామన్న, మంచిర్యాలలో దివాకర్ రావులు మినహా పెద్దగా మిగిత చోట్ల పార్టీ కార్యక్రమాలకు నేతలు దూరంగా ఉంటున్నారు. ఎదో ఆడపాతడప పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.కానీ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

ALSO READ  Drinker Sai: ‘డ్రింకర్ సాయి’ నుండి మరో పాట!

ఇది కూడా చదవండి: South America: దక్షిణ అమెరికాలో తుఫాను విధ్వంసం..నలుగురు మృతి

Adilabad: గతంలో నిర్మల్, సిర్పూర్, కాగజ్‌నగర్, ముథోల్‌లో బీఆర్‌ఎస్‌కి బలమైన నేతలుగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డిలు హస్తం గూటికి వెళ్లిన తర్వాత అక్కడ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లుగా నేతలు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకపోవడంతో అక్కడి బీఆర్‌ఎస్ క్యాడర్ కాంగ్రెస్ వైపుకు వెళ్లిందని టాక్‌ నడుస్తోంది. ఖానాపూర్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న జాన్సన్ నాయక్, చెన్నూరు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బాల్క సుమన్ స్థానికంగా ఉండకపోవడంతో అక్కడి క్యాడర్‌లో ఆత్మస్థైర్యం నింపే నాయకులు లేక నేతలు పక్క పార్టీలోకి వెల్లుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Adilabad: ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు మూడో స్థానానికి పరిమితం కావడంతో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిన నాయకత్వం పట్టించుకోకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటానరనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ పంచాయితీ ఎన్నికలకు ముందు పలువురు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పంపిన పార్టీ ఫండ్ కాజేసిన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను ముందుగా తొలగించేందుకు ఆలోచిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించి వారికి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ జిల్లా అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *