మహారాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్సీపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన మహారాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుంచి దూకేశారు. అయితే ఆయన సేఫ్టీ నెట్స్‌లో పడడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.