Sharmistha Mukherjee:కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘకాలం పనిచేసి రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన దివంగత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూతురు శర్మిష్ఠ ముఖర్జీ.. అదే కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తన తండ్రి మరణం సమయంలో కాంగ్రెస్ పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదని అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇతరుల విషయాల్లో స్పందించిన పార్టీ తన తండ్రి విషయంలో వివక్ష చూపిందని ఆరోపించారు.
Sharmistha Mukherjee: ఇప్పటికే గతంలో కాంగ్రెస్ పార్టీపై ప్రణబ్‌ముఖర్జీ కూతురు శర్మిష్ఠ ముఖర్జీ పలు ఆరోపణలు గుప్పించారు. తాజాగా దివంగత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ మరణంపై కాంగ్రెస్ పార్టీ విశేషంగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ ఏడురోజుల పాటు అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకొని, సంతాప దినాలను ప్రకటించింది. సీడబ్ల్యూసీ మీటింగ్‌లో సంతాపం ప్రకటించింది. ఏఐసీసీ కార్యాలయానికి ఆయన పార్థీవదేహాన్ని ఉంచి నివాళులర్పించింది.
Sharmistha Mukherjee: ఈ దశలోనే ప్రణబ్‌ముఖర్జీ కూతురు శర్మిష్ఠ స్పందించడం గమనార్హం. మా నాన్న చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కానేలేదు.. అని అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రపతులుగా పనిచేసిన వారి విషయంలో సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని ఓ నేత తనతో చెప్పారని పేర్కొన్నారు. అయితే మాజీ రాష్ట్రపతి అయిన కేఆర్ నారాయణన్ మరణించినప్పుడు సీడబ్ల్యూసీ సమావేశాల్లో సంతాపం తెలిపారని, అప్పటి సంతాప సందేశాన్ని తన తండ్రి ప్రణబ్ ముఖర్జీయే రాశారని గుర్తు చేశారు.
Sharmistha Mukherjee: ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తనను తప్పుదోవ పట్టించిందని శర్మిష్ఠ ముఖర్జీ తెలిపారు. మన్మోహన్‌సింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలోనే స్పందించినా, కొందరు ముఖ్య నేతల విషయంలో వివక్ష చూపిందని పలువురు విమర్శిస్తున్నారు. మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు మరణం విషయంలో అధికారంలో ఉండి కూడా తీవ్ర వివక్ష చూపిందని కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు తెలంగాణవాదులు కూడా ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.