Court Movie

Court Movie: యూఎస్ మార్కెట్ లో ‘కోర్ట్’ కి స్ట్రాంగ్ వసూళ్లు!

Court Movie: ప్రియదర్శి, హర్ష రోహన్, శివాజీ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ చిత్రం ‘కోర్ట్’. గత వారం ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. విడుదలకు ముందే పైడ్ ప్రీమియర్స్ వేసి సూపర్ హిట్ టాక్ ని మేకర్స్ అందుకున్నారు. ఇలా డే 1 నుంచి క్రేజీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తుండడం విశేషం.ఇలా లేటెస్ట్ గా యూఎస్ లో ఏకంగా 8 లక్షల డాలర్స్ మార్క్ ని ఈ చిత్రం దాటేయడం విశేషం. ప్రతీ రోజు కూడా సుమారు లక్ష డాలర్స్ మేర ఈ చిత్రం అందుకుంటూ ఉండడం అనేది గమనార్హం. ఇక ఇదే మూమెంట్ కొనసాగితే 1 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లు ఈ చిత్రానికి లాంగ్ రన్ లో దక్కవచ్చు. మరి ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి నాచురల్ స్టార్ నాని నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: అల్లు అర్జున్ పై కాంగ్రెస్ దండయాత్ర..యాక్షన్ లోకి బండి సంజయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *