Zodiac Signs: సూర్యుడు ధనుస్సు, మీన రాశి, బృహస్పతిలోకి ప్రవేశించినప్పుడు ఆ సమయాన్ని కర్మ అంటారు. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఒక రాశిలో 30 రోజులు మాత్రమే ఉంటాడు కాబట్టి కర్మల కాలం కూడా 30 రోజులే ఉంటుంది. డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది మకర సంక్రాంతి రోజు ఈ కర్మల సమయం ఉంటుంది. ఈ సమయంలో సింహరాశి, మిథునరాశి, మేషరాశి, వృశ్చిక, ధనుస్సు రాశులకు బాగా కలిసివస్తుంది. 2025 ఏడాది మొత్తం సూర్యుడి సంచార ప్రయోజనాలను పొందుతారు.
మేషం
గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆకస్మికంగా డబ్బు రావడానికి అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో మంచి రాబడులు వస్తాయి. భూమి, ఇల్లు, దుకాణం కొనుగోలు చేయాలనే కోరిక తీరుతుంది.
మిథునం
ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. దాంపత్య జీవితంలో కలహాలన్నీ తొలగిపోతాయి. అనుబంధం బలపడుతుంది. కోరిక కోరికలన్నీ నెరవేరతాయి.
సింహం
కొత్తగా ఆదాయ వనరులు తోడవుతాయి. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలన్నింటిలో విజయం సాధిస్తారు. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.
వృశ్చికం
ఆర్థికంగా బలపడతారు. దాంపత్య జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. విదేశీ పర్యటనకు ఈ సమయంలో అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం అందుకుంటారు.
ధనస్సు
విద్యార్థులకు మంచి ఫలితాలు కలుగుతాయి. కొత్త సంవత్సరం చాలా బాగుంటుంది. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారికి బాగా కలిసివచ్చే సమయం ఇది.