Jaggery Benefits: ఆయుర్వేదంలో బెల్లానికి ఔషధ ప్రాముఖ్యత ఉంది. ఇది చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది, చక్కెర కంటే ఆరోగ్యకరమైనదని చెబుతారు. బెల్లం అనేక విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. బెల్లం తినడం వల్ల శరీరంలోని సమస్యలన్నీ తీరుతాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం తినడం వల్ల మన ఆరోగ్యానికి విశేష ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలన్నింటినీ నయం చేస్తుంది. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం తినాలని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Jaggery Benefits: బెల్లం శరీరానికి అవసరమైన అనేక ఉపయోగకరమైన అంశాలను కలిగి ఉంటుంది. బెల్లంలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి బెల్లం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
బెల్లం జీర్ణక్రియకు మంచిది. కాబట్టి భోజనం తర్వాత తింటారు. బెల్లం జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. బెల్లం శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. కాబట్టి దీన్ని లివర్ టానిక్ అంటారు. ఇది కాలేయాన్ని శుభ్రంగా, ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
బెల్లంలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు పటిష్టం కావడానికి సహాయపడుతుంది. ఇది కీళ్లలో నొప్పి, మంటను తగ్గిస్తుంది. ప్రధానంగా బెల్లం తీసుకోవడం వల్ల స్త్రీలకు నెలసరి నొప్పి తగ్గుతుంది. ఇది కండరాలను సడలిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
Jaggery Benefits: బెల్లంలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు రక్తాన్ని శుద్ధి చేసి రక్తహీనతను నివారిస్తుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారికి బెల్లం తినడం మేలు చేస్తుంది.