Chandrababu Naidu

Chandrababu Naidu: 22 వేల మంది గిరిజన విద్యార్థులు సూర్యనమస్కారాలతో.. గిన్నిస్‌ రికార్డు సాధించారు

Chandrababu Naidu: ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న యోగా ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తనదైన ముద్ర వేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం చరిత్ర సృష్టించింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “యోగాతో శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు… మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, ఏకాగ్రత కూడా లభిస్తాయి. ఇది వ్యాయామం మాత్రమే కాదు – జీవన విధానంగా తీసుకోవాలి,” అని స్పష్టం చేశారు.

మోదీ విజన్‌కు వ్యాప్తి – 175 దేశాల్లో యోగా దినోత్సవం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో యోగా ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లో 10 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని వివరించారు. “రికార్డులు ఎవరికైనా సాధ్యం కావు… మోదీకి మాత్రమే సాధ్యం,” అని వ్యాఖ్యానించారు.

విశాఖలో విశేషాలు – గిరిజన విద్యార్థుల ఘనత

విశాఖలో 1.44 లక్షల మంది యోగా శిక్షకుల నమోదు జరిగింది. ప్రత్యేకంగా 22 వేల మంది గిరిజన విద్యార్థులు కలిసి సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్‌ రికార్డు సాధించడం గర్వకారణమని సీఎం తెలిపారు. “ఇది యోగా ద్వారా సాధించదగిన అద్భుత విజయాలకు ఉదాహరణ,” అన్నారు.

ఇది కూడా చదవండి: YogAndhra 2025: యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసింది..

రాష్ట్రాన్ని యోగావంతం చేసేద్దాం – 30 రోజుల యోగా ఉద్యమం

ఆంధ్రప్రదేశ్‌లో 30 రోజులపాటు యోగాను రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలా కొనసాగించామని చంద్రబాబు చెప్పారు. ప్రజలు రోజూ కనీసం ఒక గంట యోగాకు సమయం కేటాయించాలని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించేందుకు యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

సెప్టెంబర్‌లో సూపర్ లీగ్ ప్రారంభం

సెప్టెంబర్‌లో యోగాకు సంబంధించిన సూపర్ లీగ్‌ను ప్రారంభించనున్నట్టు సీఎం తెలిపారు. అన్ని క్రీడా కార్యక్రమాల్లో యోగాను భాగంగా చేర్చాలన్నదే ప్రభుత్వ దృష్టి. యోగా ప్రతిఒక్కరి జీవితంలో మార్పును తీసుకురావాల్సిన సాధనమని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *