Dosa Batter: ప్రతి ఒక్కరూ ఉదయం టిఫిన్ ఏంచేయాలని ఆలోచిస్తారు. కానీ ఒక్కసారి దోస పిండిని తయారు చేస్తే రెండు మూడు రకాలు టిఫిన్లు చేసుకోవచ్చు. కానీ దోశ పిండి 24 గంటల తర్వాత పుల్లగా మారుతుంది. అయితే ఇలా నిల్వ చేస్తే పులుపు రాదు. పిండిని గ్రైండ్ చేసి నిల్వ ఉంచేటప్పుడు కొన్ని రూల్స్ పాటిస్తే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.
ఇంట్లో తయారుచేసిన దోశ పిండితో వేడి వేడి అప్పం, మసాలా, సెట్ దోసె, ఉత్తప్ప వంటివి చేసుకోవచ్చు. ఈ పిండిలో కొన్ని కూరగాయలు కలుపుకుంటే రుచికరంగా తయారవుతుంది. ఇంట్లో ఫ్రిజ్ లేకపోయినా దోశ పిండిని పులుపు రాకుండా 5 నుంచి 6 రోజులు నిల్వ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు.. ఆ వ్యాఖ్యలే కారణం
చిట్కా 1
Dosa Batter: దోశ పిండి కోసం బియ్యం, పప్పు నానబెట్టిన తర్వాత మధ్యలో ఒకసారి నీటిని మార్చాలి. కనీసం 8 నుండి 9 గంటలు నానబెట్టాలి. పిండిని రుబ్బేటప్పుడు చల్లటి నీటిని ఉపయోగించొద్దు. బాగా వేడిచేసిన నీళ్ళు వేసి గ్రైండ్ చేయడం వల్ల పిండి త్వరగా పుల్లగా మారదు.
చిట్కా 2
Dosa Batter: పిండిని మెత్తగా రుబ్బేటప్పుడు కొబ్బరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. అవసరమైతే దోశ వేసుకునేటప్పుడు కొబ్బరి తురుము వేయవచ్చు. నానబెట్టిన మెంతి గింజలను బియ్యం,పప్పుతో కలిపితే పిండి మెత్తగా ఉంటుంది. మెంతులు దోశ రుచిని మరింతగా పెంచుతాయి.
చిట్కా 3
Dosa Batter: దోశ పిండి రుబ్బిన వెంటనే ఉప్పు, బేకింగ్ సోడా వేయకూడదు. బేకింగ్ సోడా కలిపితే పిండి పాడవుతుంది. దోశ వేసుకునేటప్పుడు బేకింగ్ సోడాను యాడ్ చేయొచ్చు. దోశ పిండిని పదే పదే తీయకుండా.. అవసరమైనంత మాత్రమే డబ్బాలో వేసి వాడాలి.
చిట్కా 4
Dosa Batter: దోశ పిండిని ఫ్రిజ్‌లో ఎక్కువసేపు నిల్వ ఉంచుకోవచ్చు. ఇంట్లో ఫ్రిజ్ లేకపోతే వెడల్పాటి డబ్బాలో నీళ్లు నింపి అందులో దోశ పిండిని ఉంచితే వారం రోజుల పాటు ఉంటుంది. అయితే నీటిని రోజుకు రెండు మూడు సార్లు మార్చాలి.