chandrababu

Chandrababu: బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తా.. చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌

Chandrababu: బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తాను అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఇద్దరు మహిళ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పెన్లన్లు అందించారు.  తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కూటమిని గెలిపించారని అక్కడి ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు.అనంతపురం జిల్లాపై తనకు ప్రత్యేక అభిమానం ఉంది అని గుర్తుచేసుకున్నారు.పక్క రాష్ట్రలలో ఎక్కడ లేని విధంగా పెన్షన్‌లు అధికంగా ఇస్తున్నాము అని తెలిపారు. పక్కనే వున్నా కర్ణాటకలో కూడా 1200 రూపాయిలు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని చెప్పారు. పెన్షన్‌ పెంచిన ఘనత టీడీపీదే అన్నారు.  పెన్షన్‌ లబ్ధిదారుల్లో కూలీలు, కార్మికులు ఉన్నారు. ఇక పెన్షన్ల పంపిణీలో పైసా అవినీతి ఉండకూడదని అధికారులకి చెప్పాను అని తెలిపారు. కష్టపడి పనిచేసి రాష్ట్ర సంపద పెంచుతాం వచ్చిన సంపద పేదలకు పంచుతాం అని చంద్రబాబు అన్నారు. 

ఇది కూడా చదవండి: Chandrababu: నేరుగా ఇంటికి వెళ్లి.. సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ!

Chandrababu: ఇక, గత ప్రభుత్వంలో  ఎన్ని పాపాలు చేయాలో అని చేశారు. ఇంకా వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి మరీ రుణాలు తెచ్చింది వైసీపీ ప్రభుత్వం. . చివరకు తహసీల్దార్ కార్యాలయలు తాకట్టు పెట్టే పరిస్థితికి గత ప్రభుత్వం తయారయ్యిందని ఫైర్‌ అయ్యారు.. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం దొరికేది.. మేం వచ్చాక నాణ్యమైన మద్యం దొరుకుతుందన్నారు..ఇప్పుడు ఇక్కడే మంచి అయితే, బెల్ట్‌ షాపులు పెడుతున్నారని ప్రచారంపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు.. బెల్ట్ షాపులు పెడితే… బెల్ట్ తీస్తా అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.. మద్యం దుకాణాల విషయలో నాయకులు, దందాలు చేసే వారు దూరితే వారిని వదలను అంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

One Reply to “Chandrababu: బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తా.. చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *