war-2

War-2: ఎన్టీఆర్ ‘వార్ 2’కి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్!?

War-2: హృతిక్ రోషన్ తో కలసి ఎన్టీఆర్ నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం ‘వార్-2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇండియాలోని టాప్ డాన్సింగ్ స్టార్స్ కలసి చేస్తున్న సినిమా కావటంతో దీనిపై భారీ బజ్ ఉంది. అయితే డాన్స్ లతో పాటు ఫైట్స్ కి కూడా ప్రాధాన్యముందట. అందుకే ఈ సినిమాలో స్టంట్స్ కోసం హాలీవుడ్ ‘వెనమ్’ చిత్రానికి పని చేసిన స్టంట్ కో ఆర్డినేటర్స్ స్పిరో రజాటోస్, ‘ఎవెంజర్స్-ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ సినిమాకు పని చేసిన సేయాంగ్ వో రంగంలోకి దిగారట. వీరితో పాటు ‘జవాన్, పఠాన్’ చిత్రాలకు పని చేసిన సునీల్ రోడ్రిగ్స్, ‘వండర్ వుమన్’ ఫేమ్ స్టీవ్ బ్రౌన్, ‘వారియర్ నన్’కి పని చేసిన మిగ్యుల్ జుజ్ గాడో కూడా ‘వార్-2’ మూవీ  స్టంట్ సీక్వెన్స్ ల కోసం వర్క్ చేశారట. ఇక ఎన్టీఆర్, హృతిక్ పై డిసెంబర్ రెండో వారంలో గోరేగావ్ ఫిలిమ్ సిటీలోనూ, అంధేరిలోని యశ్ రాజ్ ఫిల్మ్ స్టూడియోలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా భారీ సెట్ నిర్మిస్తున్నారట. మరి ‘వార్2’ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ డాన్స్ లతో పాటు ఫైట్స్ తో నూ ఏ స్థాయిలో అలరిస్తారో చూద్దాం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pushpa 2: 'పుష్ప-2'కు గుమ్మడికాయ కొట్టేశారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *