K.S. Viswanathan: రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం తొలి బోర్డు సమావేశం సోమవారం విజయవాడ ఫార్చూన్ మురళి పార్క్ హోటల్‌లో విజయవంతంగా నిర్వహించామని మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్ తెలిపారు.
మరింత K.S. Viswanathan: ఏ.పి. ఫిలిం, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ తొలి డైరెక్టర్ల సమావేశంCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
TG Public School: రేపు తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
TG Public School: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో రాష్ట్రంలోనే మొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ సిద్ధమైంది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో, కార్పొరేట్ ప్రమాణాలతో ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్ వరకు నిర్మించిన ఈ మోడల్ స్కూల్‌ను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లు, క్రీడా మైదానాన్ని పరిశీలించనున్న సీఎం.. విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని ప్రారంభించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మరింత TG Public School: రేపు తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!Pawan Kalyan: మోడీకి అందుకే మద్దతిస్తున్న.. భద్రత లేని జీవితాలు వృధా
Pawan Kalyan: ముంబై 26/11 దాడుల సమయంలో దేశానికి ఒక బలమైన నాయకుడు కావాలని వారణాసిలో తన తండ్రి అస్తికలు నిమజ్జనం చేసేటప్పుడు కాశీ విశ్వనాథుడిని మొక్కుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక గొప్ప నాయకుడిని పుట్టించే శక్తి భారతదేశానికి ఉందన్న నాని పాల్కీవాలా మాటలను గుర్తుచేస్తూ.. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షల రూపమే నరేంద్ర మోదీ అని చెప్పారు. అభివృద్ధి కంటే దేశ భద్రతే ముఖ్యమని, అందుకే తమ సదస్సులో మోదీని అభినందిస్తూ మొదటి తీర్మానం పెట్టామని స్పష్టం చేశారు.
మరింత Pawan Kalyan: మోడీకి అందుకే మద్దతిస్తున్న.. భద్రత లేని జీవితాలు వృధాNEET Re-Exam: దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ ఎక్సమ్ టైమింగ్ పెంపు
NEET Re-Exam: ఈ నెల 21న జరిగే నీట్ రీ-ఎగ్జామ్ భద్రతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జూన్ 22 వరకు దేశంలో టెలిగ్రామ్ యాప్‌ను తాత్కాలికంగా నిషేధించింది. అలాగే జూన్ 30 వరకు టెలిగ్రామ్ ఎడిట్ ఆప్షన్‌ను కూడా తొలగించింది. మరోవైపు ఎన్టీఏ పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచింది. పేపర్ లీక్ అవ్వకుండా ఉండేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రశ్నాపత్రాల తరలింపునకు విమానాలను ఉపయోగించారు.
మరింత NEET Re-Exam: దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ ఎక్సమ్ టైమింగ్ పెంపుIND-A vs SL-A: తిలక్ వర్మ పొరపాటు వలె.. చిత్తుగా ఓడిపోయిన భారత్
IND-A vs SL-A: శ్రీలంక ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ‘ఎ’ సూపర్ ఓవర్‌లో ఓడిపోయింది. మెయిన్ మ్యాచ్‌లో విప్రజ్ నిగమ్ పిచ్‌పై తప్పుగా పరుగెత్తడం వల్ల లంకకు 10 పెనాల్టీ రన్స్ రావడం, సూపర్ ఓవర్‌లో రుతురాజ్, తిలక్ కాకుండా సూర్యాంశ్ షెడ్గేను బ్యాటింగ్‌కు పంపి స్ట్రైక్ ఇవ్వడంలో జరిగిన వ్యూహాత్మక లోపాలే భారత్ ఓటమికి కారణమయ్యాయి.
మరింత IND-A vs SL-A: తిలక్ వర్మ పొరపాటు వలె.. చిత్తుగా ఓడిపోయిన భారత్Adhika Masam: లో మీ పిల్లలు పుట్టారా? వారి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలపై ప్రత్యేక జ్యోతిష్య విశ్లేషణ!
Adhika Masam: సుమారు మూడేళ్లకు ఒకసారి వచ్చే పవిత్ర అధిక మాసాన్ని ‘పురుషోత్తమ మాసం’ అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో జన్మించిన పిల్లలు విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉంటారు. వీరు అద్భుతమైన తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు మరియు స్వతంత్ర భావాలతో సమాజంలో ఉన్నత స్థానాన్ని సంపాదిస్తారు. ఈ పిల్లలకు శ్రీహరి నామాలు పెట్టడం వల్ల మరింత అదృష్టం కలిసి వస్తుంది.
మరింత Adhika Masam: లో మీ పిల్లలు పుట్టారా? వారి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలపై ప్రత్యేక జ్యోతిష్య విశ్లేషణ!Crime News: ప్రేమ వల విసిరి.. పనిమనిషిని గర్భవతిని చేశాడు..!
Crime News: కోస్గి పట్టణంలో బంగారం దుకాణం నడిపే సాయికృష్ణ అనే యువకుడు, తన ఇంట్లో పనిచేసే 20 ఏళ్ల యువతిని ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే కులం పేరుతో దూషించాడు. రాజకీయ నాయకుల జోక్యంతో మొదట కేసు నమోదు కాకపోయినా, బాధితురాలి పట్టుదలతో ఆదివారం రాత్రి అట్రాసిటీ కేసు నమోదైంది. సోమవారం డీఎస్పీ లింగయ్య ఘటనా స్థలానికి వెళ్లి నిందితుడి ప్రవర్తనపై పూర్తి విచారణ జరిపారు.
మరింత Crime News: ప్రేమ వల విసిరి.. పనిమనిషిని గర్భవతిని చేశాడు..!Abhijit Deepak: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి..!
Abhijit Deepak: జైపూర్‌లో నీట్ లీకేజీకి వ్యతిరేకంగా సీజేపీ నిర్వహించిన నిరసన ర్యాలీలో పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు చెంపదెబ్బ కొట్టి దాడి చేశారు. ఆగ్రహించిన కార్యకర్తలు దాడి చేసిన వారిని పట్టుకుని చితకబాదారు. సుప్రీంకోర్టు జడ్జి యువతను బొద్దింకలతో పోల్చిన వ్యాఖ్యల బ్యాక్‌డ్రాప్‌లో పుట్టిన ఈ పార్టీ.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం దేశవ్యాప్త ఆందోళనలు చేస్తోంది.
మరింత Abhijit Deepak: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి..!Chiru – Ram: ఒకే ఏడాది ₹300 కోట్ల క్లబ్‌లో తండ్రీకొడుకులు.. చిరు, చరణ్ రేర్ రికార్డు..!
Chiru – Ram: టాలీవుడ్ చరిత్రలో ఒకే ఏడాదిలో తండ్రీకొడుకులు ఇద్దరూ విడివిడిగా ₹300 కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించారు. చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం ₹300 కోట్లు వసూలు చేయగా, రామ్ చరణ్-బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం కేవలం 11 రోజుల్లోనే ₹393 కోట్ల గ్రాస్ సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.
మరింత Chiru – Ram: ఒకే ఏడాది ₹300 కోట్ల క్లబ్‌లో తండ్రీకొడుకులు.. చిరు, చరణ్ రేర్ రికార్డు..!Pawan Kalyan: ప్రాంతీయ గోడలు బద్దలుకొట్టండి.. సోషల్ మీడియాలో మీ మైండ్‌తో ఆడుకుంటున్నారు
Pawan Kalyan ఢిల్లీలో జనసేన సదస్సులో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను అభినందిస్తూ తీర్మానం చేశారు. స్వార్థపరుల వల్లే ‘కాక్రోచ్ జనతా పార్టీలు’ వస్తున్నాయని, సోషల్ మీడియాలో యువత మైండ్‌తో ఆడుకునే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వర్గీస్ కురియన్, ఈ శ్రీధరన్, విశ్వేశ్వరయ్యల సేవలను గుర్తుచేస్తూ.. ప్రాంతీయ గోడలు బద్దలుకొట్టి ‘భారతీయుడు’ అనే ఒకే గుర్తింపుతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
మరింత Pawan Kalyan: ప్రాంతీయ గోడలు బద్దలుకొట్టండి.. సోషల్ మీడియాలో మీ మైండ్‌తో ఆడుకుంటున్నారు