botsa satyanarayana: వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. “కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లే, వైసీపీ ఓటమికి కూడా ఎన్నో కారణాలున్నాయి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కలయికతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే రూ. 1,50,000 కోట్ల అప్పు చేసినట్టు బొత్స ఆరోపించారు. అంత భారీ మొత్తంలో అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతికి నెట్టిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా నమ్మగలరో ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర పరిపాలనలో పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
**అమరావతిపై మోదీ వైఖరిని ప్రశ్నించిన బొత్స**
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి ఎందుకు వచ్చారు? ఇప్పటివరకు అక్కడ ఏమీ చేయలేదు. ఇకపై ఏం చేయబోతున్నారు అన్న స్పష్టత ఇవ్వకుండా ఎందుకు ప్రయాణించారని బొత్స నిలదీశారు. మోదీ శంకుస్థాపన చేసిన “దక్షిణ మధ్య రైల్వే జోన్” విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని, పనులు ప్రారంభమయ్యాయో లేదో కూడా ప్రజలకు తెలియకపోవడం విచారకరమని ఆయన అభిప్రాయపడ్డారు.