Borugadda Anil: బెయిల్ పిటిషన్‌ను రిజెక్ట్ 

Borugadda Anil: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు సుప్రీంకోర్టులో తీవ్ర పరాభవం ఎదురైంది. ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. గతంలో పొందిన మధ్యంతర బెయిల్ సమయంలో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు భావించడంతో, ఈసారి పిటిషన్‌ను సుప్రీం కొట్టేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. దీంతో అనిల్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆయనకు తక్షణ ఉపశమనం లభించే అవకాశాలు లేకుండాపోయాయి.

ఇదిలా ఉండగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్‌పై విచారణ కొనసాగుతోంది. 2023లో టీడీపీ మహిళా నేత తేజస్విని ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు కాగా, తాజాగా అనంతపురం కోర్టులో అనిల్‌ను పోలీసులు హాజరుపరిచారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. రేపు పీఎం కిసాన్ నిధులు విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *