బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు.
తాజాగా, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. ఆ విమానం హైదరాబాద్ నుంచి ఛండీగఢ్ వెళ్లాల్సి ఉంది. బెదిరింపు కాల్ నేపథ్యంలో… విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
విమానంలో 130 మంది ప్రయాణికులు ఉండగా… వారందరినీ కిందికి దింపి, విమానంలో అణువణువు సోదా చేశారు. విమానంలో బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఇండిగో విమానం ఛండీగఢ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.