Google Internship: టెక్నాలజీ రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఒక మంచి అవకాశం. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) లాంటి అత్యాధునిక రంగాలలో పని చేసే అవకాశం పొందుతారు. కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి, పరిశ్రమ అనుభవాన్ని పొందడానికి ఇది మంచి అవకాశం.
ఈ సంవత్సరం ఈ 12 వారాల ప్రోగ్రామ్ నవంబర్‌లో ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 17, 2025. కంప్యూటర్ సైన్స్, గణితం, భాషాశాస్త్రం, గణాంకాలు లేదా సంబంధిత సాంకేతిక రంగాలలో మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు అర్హులు.
Also Read: Chhaava in Parliament: పార్లమెంట్‌లో ‘ఛావా’ మూవి స్పెషల్ స్క్రీనింగ్?
Google Internship: ఈ ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థులు Google నిపుణుల మార్గదర్శకత్వంలో పని చేసి, అసలు Google ఉత్పత్తుల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు. క్లౌడ్ కంప్యూటింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) వంటి రంగాలలో వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు.
ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనుకుంటే, Google అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి buildyourfuture లింక్ ద్వారా దరఖాస్తు చేయండి. దరఖాస్తు చేసే ముందు అర్హత నిబంధనలను జాగ్రత్తగా చదవండి.