Hyderabad: హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉన్న సిటీ సివిల్ కోర్టుకు మంగళవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ బెదిరింపుతో కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయబడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కలిసి కోర్టు ప్రాంగణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. కోర్టులో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు పంపించారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇది తప్పుడు బెదిరింపు (hoax call) కావచ్చని భావిస్తున్నప్పటికీ, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పాతబస్తీ కోర్టు పరిసరాల్లో పోలీసు బందోబస్తును కట్టుదిట్టం చేశారు.
