Periods: ఋతు చక్రం అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఈ సమయంలో మహిళల శరీరాల నుండి చెడు రక్తం బయటకు వస్తుంది. ఈ కారణంగా, వారు అనేక నియమాలను పాటించాల్సి ఉంటుంది. గతంలో, ఋతుస్రావం సమయంలో స్త్రీలను వేరుగా ఉంచేవారు. అంతేకాకుండా, వారు ఎలాంటి పని చేయడానికి అనుమతించేవారు కాదు. ఋతుస్రావం సమయంలో మహిళలు ఊరగాయలను ముట్టుకోకూడదు అని అలా చేస్తే అది పాడు అవుతుందని అంటారు. కానీ ఇది నిజమేనా? ఋతుస్రావం గురించి కొన్ని నిజాలు మరియు అపోహల గురించి తెలుసుకుందాం,
శతాబ్దాల నాటి నమ్మకాల ప్రకారం.. రుతుస్రావం సమయంలో మహిళలు వంటగదిలోకి ప్రవేశించడానికి లేదా ఊరగాయలను తాకడానికి వీలు లేకుండా ఉండే. ఈ సమయంలో వారు అపవిత్రంగా ఉంటారని, కాబట్టి తాకిన ప్రతిదీ అపవిత్రంగా మారుతుందని విశ్వసించారు. ఆసక్తికరమైన విషయమేమిట౦టే.. ఆహార౦ పవిత్రమైనదిగా భావిస్తారు. కాబట్టి అపవిత్రమైనదేదీ ఆహారాన్ని ముట్టుకోకూడదని ప్రజలు నమ్మేవారు.
ఇది కూడా చదవండి: Irregular Periods: ఎక్కవగా వ్యాయామం చేస్తే లేట్ పీరియడ్స్
ఒక సిద్ధాంత౦ ప్రకార౦.. అపరిశుభ్రమైన రక్త౦ స౦క్రమణ వ౦టివి ప్రమాదాలు ఎదురు కాకుండా ఉ౦డే౦దుకు, పరిశుభ్రతను దృష్టిలో ఉ౦చుకునే౦దుకు ఈ నియమాలు చేయబడ్డాయని నమ్ముతారు. అయితే కొ౦తమ౦ది స్త్రీలు మూడు రోజుల పాటు పనికి దూర౦గా ఉ౦డే౦దుకు.. వారికి పని ను౦చి విరామ౦ ఇవ్వడానికి అలా చేయబడి౦దని నమ్ముతారు. అందువల్ల ఈ సమయంలో ఊరగాయను తయారు చేయడానికి, తాకడానికి వీల్లేదంటారు.