Laddu gang issue

Laddu gang issue: లడ్డు గ్యాంగ్‌తో వైసీపీకి సంబంధం? పోలీసులతో సున్నం!

Laddu gang issue: రౌడీ మూకలు, సంఘ విద్రోహ చర్యల ఆట కట్టించి.. లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్‌లో పెట్టాల్సిన బాధ్యత పోలీసులది. అలాంటి పోలీసులపైనే దాడి చేసిన గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లపై చర్యలు తీసుకోవడం తప్పంటున్నారు వైసీపీ, దాని అనుబంధ సంఘాల నాయకులు. పదుల సంఖ్యలో గంజాయి కేసులు, క్రిమినల్‌ రికార్డులు, రౌడీ షీట్లు ఉన్న వారిని కులం కార్డు పేరుతో సపోర్ట్ చేయడాన్ని ఇప్పుడు అందరూ ఖండిస్తున్నారు. ఇలాంటి విషయాల్లోనూ కులం పేరుతో రాజకీయం చేయడం ఒక్క వైసీపీకే చెల్లిందంటూ ఛీత్కరించుకుంటున్నారు.

గత నెల 24వ తారీఖు.. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు.. కన్నా.చిరంజీవి అనే కానిస్టేబుల్.. తన విధులు ముగించుకొని ఐతా నగర్‌లో ఉన్న తన ఇంటికి వెళుతున్న సమయంలో అప్పటికే పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న చేబ్రోలు జాన్ విక్టర్, షేక్ బాబూలాల్ అలియాస్ కరిముల్లా, దోమ రాకేష్, వేము నవీన్ అలియాస్ కిల్లర్.. అనే నలుగురు దారి కాచి కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేశారు. తనపై జరిగిన దాడిపై కానిస్టేబుల్‌ చిరంజీవి కేసు పెట్టారు. దీంతో పోలీసులు… ఎస్పీ సతీష్ ఆదేశాలతో గత నెల 27వ తారీఖున ఐతా నగర్‌లో పర్యటించి వేము నవీన్ అలియాస్ కిల్లర్ అనే రౌడీ షీటర్‌ని మినహా మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నవీన్‌ అలియాస్‌ కిల్లర్‌ మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని, ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. జిల్లా ఎస్పీ ఆదేశాల అనుగుణంగా ఐతా నగర్‌లో ఎక్కడైతే కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై దాడి చేశారో… అదే చోట ముగ్గురు నిందితులకు పోలీసులు అరికాలి కోటింగ్ ఇచ్చారు. బహిరంగంగా నిందితులకు అరికాలి కోటింగ్ ఇవ్వడంపై వైసీపీ నాయకులు, దాని అనుబంధ సంఘాల నాయకులు మినహా… రాష్ట్రం మొత్తం హర్షం వ్యక్తం చేయడంతో పాటూ పోలీసులకు అభినందనలు తెలిపారు.

Also Read: Mamata Banerjee: న‌రేంద్ర మోదీపై మ‌మ‌తా బెన‌ర్జీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అయితే వైసీపీ నాయకులు మాత్రం నిందితులు దళితులు కాబట్టి వారికి రౌడీయిజం, గూండాయిజం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి అన్నట్లు మాట్లాడుతున్నారు. గంజాయి బ్యాచ్‌కి బహిరంగంగా అరికాలి కోటింగ్‌ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి పోలీసులు ఎవరు? వారిని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయ్ అంటూ నిందితులకు వత్తాసు పలుకుతూ మీడియా ముందుకు వచ్చారు. అయితే పస్ట్ నిందితులే గంజాయి సేవించి.. పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన సంగతి పాపం వైసీపీ నాయకులు మరచిపోయారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానికి రాజకీయ రంగు, కులం రంగు పులిమి.. దానిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడుతున్నారు వైసీపీ నేతలు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో సైతం వాస్తవాలను వక్రీకరించి.. ప్రవీణ్ యాక్సిడెంట్ విషయాన్ని హత్యగా చిత్రీకరించడానికి వైసీసీ నాయకులు చేసిన పాట్లు అన్నీ ఇన్ని కావు. చివరికి ప్రవీణ్ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజ్ బయటకు రావడంతో అబాసు పాలయ్యారు.

ఇప్పుడు తెనాలి ఐతా నగర్‌ ఘటనను సైతం కులం కార్డు వాడి రాజకీయం చేయాలని చూస్తున్నారు వైసీపీ నాయకులు. కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై విచాక్షణా రహితంగా దాడి చేసిన నిందితులు దళితులు కాబట్టే దాడి చేశారని రాజకీయం చేయాలని చూశారు. దళితులపై దాడి అంటూ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు.

Also Read: Kavitha: కవిత కోసమే క్యాబినెట్‌ విస్తరణ ఆగిందా?

అయితే ఈ గంజాయి బ్యాచ్‌ చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్‌ కన్నా.చిరంజీవి ఒక బీసీ. ఆయన భార్య ఎస్సీ దళితురాలు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎస్పీది కూడా దళిత సామాజికవర్గమే అనే సంగతి వైసీపీ లీడర్స్‌ మరచిపోయారు. ఇప్పుడు దళితురాలైన కానిస్టేబుల్‌ చిరంజీవి భార్య బయటకొచ్చి.. కులం ముసుగులో రాజకీయం చేస్తున్న వారికి గడ్డిపెట్టారు. నిజమైన దళితులకు అవమానం, అన్యాయం జరిగినప్పుడు వచ్చి పోరాటం చేయండి కానీ.. ఇలా రౌడీ షీటర్లకు, మానవ మృగాలకు సపోర్ట్‌ చేయొద్దని చాలా చక్కగా చెప్పారామె.

పదుల సంఖ్యలో కేసులు ఉండి, గంజాయి బ్యాచ్‌గా ఉన్న నిందితులను కులం కార్డు ఆధారంగా సపోర్ట్ చేయడం, వారిని కాపాడాలనుకోవడంపై… వైసీపీ నేతల తీరుపై ప్రజలు, మహిళలు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. కానిస్టేబుల్‌ భార్య ఆవేదన చూసిన తర్వాత… పోలీసులు ఈ కేసును మరింత టైట్‌ చేసినట్లు చెబుతున్నారు. ప్రజలు కూడా ఇలాంటి పోలీసింగే మాకు కావాలంటూ మద్ధతు పలుకుతున్నారు.

నేరం చేసిన వారికి, సంగ విద్రోహ చర్యలకు పాల్ఫడిన వారికి శిక్ష పడాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఈ విధంగా శిక్షించటం ద్వారా మరెవరూ దాడులు చేయటానికి సాహసించరు. ఇలాంటి సమయంలో రాజకీయాల కోసం రౌడీ షీటర్లకు మద్దతుగా నిలిచే స్థాయికి వైసీపీ దిగజారిపోయింది. ఇప్పుడు ప్రజలు రౌడీ షీటర్లకు మద్దతుగా నిలుస్తున్న వైసీపీ వైఖరి చూసి ప్రజలు, మహిళలు ఛీత్కరించుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *