BSNL New Recharge Plan: BSNL ట్రెండ్‌కి అనుగుణంగా కొత్త రీచార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో కాలింగ్, డేటా, SMS లతో ఇయర్లీ రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రోజుకు రూ.3.5 కాగా నెలకు రూ.100 మాత్రమే.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కస్టమర్లకు అద్భుతమైన బహుమతిని అందించింది. ఈ కంపెనీ తక్కువ ధరలో మనీకి విలువైన ప్రీపెయిడ్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఈ సరసమైన ప్లాన్‌లో కాలింగ్ ప్రయోజనాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. నిజానికి ఈ ప్లాన్ డేటా, SMS పంపే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఈ ఇయర్లీ ప్లాన్ ధర కూడా రూ.1,200 కంటే తక్కువ. ప్రతిరోజు రూ.3.50 లోపే ఖర్చు అవుతుంది.
అంటే, మీరు రోజుకు కేవలం రూ. 3.50తో అన్ని ప్రయోజనాలను పొందొచ్చు. ఇతర కంపెనీల రీఛార్జ్‌లు ప్లాన్స్ BSNLతో పోలిస్తే చాలా ఖరీదైనవి. అందుకే కస్టమర్ల కోసం BSNL ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ కు సంబంధించిన మరిన్ని ప్రయోజనాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
BSNL బెస్ట్ ప్లాన్:
BSNL ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 1,198. రోజువారీ ఖర్చు సుమారు రూ. 3.50 వరకు వస్తుంది. దీని వాలిడిటీ 365 రోజులు. కస్టమర్లు ఎలాంటి పరిమితి లేకుండా 3GB హై-స్పీడ్ 3G/4G డేటాను పొందవచ్చు.
ఇది ప్రతి నెలా 30 SMSలను పంపే సదుపాయం కూడా ఈ ప్లాన్ ద్వారా అందిస్తున్నారు. ప్రతి నెలా 300 నిమిషాల ప్రీ కాలింగ్ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ తీసుకుంటే దేశంలోనే ఏ ప్రదేశానికి వెళ్లిన పనిచేస్తుంది . ఇన్‌కమింగ్ కాల్‌లకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్లాన్ ధరలో తగ్గింపు:
BSNL మరో 365 రోజుల ప్లాన్ ధరను తగ్గించింది. ఈ ప్లాన్ ప్రారంభంలో రూ. 1,999కి అందుబాటులో ఉండగా ఇప్పుడు రూ. 1,899కి అందిస్తోంది. దీనిపై రూ.100 తగ్గింపు ఉంది. 7 నవంబర్ 2024 వరకు కస్టమర్లు ఈ ప్లాన్ రీచార్జ్ చేసకునే అవకాశం ఉంది. ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ కాలింగ్, 600GB డేటా, ప్రతిరోజు 100 ఉచిత SMSలు ఉంటాయి.
సరసమైన ప్లాన్‌లపై కంపెనీ ప్రాధాన్యత
వినియోగదారులను ఆకర్షించేందుకు BSNL కృషి చేస్తోంది. లాంగ్ టర్మ్ ప్లాన్‌లను సరసమైన ధరలకే అందిస్తోంది.
BSNLని సెకండరీ సిమ్‌గా ఉపయోగించే వారికి ఈ రీఛార్జ్ ప్లాన్ చాలా బాగుంటుంది. ఈ ప్లాన్ వాడితే ప్రతి నెలా రూ. 100 కంటే తక్కువ ఖర్చు అవుతుంది. విశేషమేమిటంటే కొన్ని చోట్ల కంపెనీ 4జీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం వీలైతే వెంటనే BSNL సిమ్ తీసుకొని బెనిఫిట్స్ అందుకోండి.