Tollywood: సందీప్ రెడ్డి వంగా‌కు రామ్ చరణ్, ఉపాసన నుంచి ఊహించని కానుక 

Tollywood: ప్రఖ్యాత టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన ఆయనకు ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన దంపతుల నుంచి ఓ అద్భుతమైన సర్‌ప్రైజ్ అందింది.

ఈ విషయాన్ని సందీప్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. చరణ్ దంపతులు తమ ‘అత్తమాస్ కిచెన్’ నుంచి స్వయంగా తయారు చేసిన ఆవకాయ పచ్చడిని అందించడంతో పాటు, ఒక ప్రేమభరితమైన సందేశాన్ని కూడా జత చేశారు.

ఈ అనూహ్య కానుకతో ఆనందంతో ఉప్పొంగిపోయిన సందీప్, వెంటనే ఆ ఆవకాయ జాడీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ –

“ఈ సర్‌ప్రైజ్ అద్భుతంగా ఉంది. టేస్ట్ కూడా అలాంటిదే ఉండబోతోంది!” అంటూ రాసుకొచ్చారు.

అలాగే చరణ్, ఉపాసనలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు “వావ్”, “సూపర్” అంటూ స్పందిస్తున్నారు.

ఇదిలా ఉంటే, సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘స్పిరిట్’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు.

అయితే ఈ సినిమాకు హీరోయిన్ ఎంపిక విషయంలో కొంత వివాదం చుట్టుముట్టినట్టు వార్తలు వచ్చాయి. మొదట దీపికా పదుకునేను కథానాయికగా ఎంపిక చేసినప్పటికీ, కథా చర్చల అనంతరం జరిగిన మనస్పర్థల నేపథ్యంలో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో, దీపిక పీఆర్ టీమ్ మూవీకి సంబంధించిన కొన్ని అంశాలను లీక్ చేస్తున్నారన్న అనుమానంతో, సందీప్ రెడ్డి వంగా తన సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా వ్యంగ్యంగా స్పందించినట్లు చెబుతున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Megastar-Anil: నార్త్ ఇండియాలో మెగాస్టార్‌ అనిల్ రావిపూడి మాస్ జాతర!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *