Mamata Banerjee: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు తాము సిద్ధమే.. మీరు సిద్ధమా? అని ఇటీవలే తాజాగా సవాల్ విసిరిన మమతా బెనర్జీ.. తాజాగా మోదీ వ్యాఖ్యలపై మరో సవాల్ విసిరారు. త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా వైరి వర్గాల వ్యాఖ్యలు రాజకీయ అలజడిని రేపుతున్నాయి.
Mamata Banerjee: ఆపరేషన్ సిందూర్ లాగా ఆపరేషన్ బెంగాల్ చేస్తాం.. అని చెప్పడంపై మమతా బెనర్జీ తీవ్రంగా పరిగణించారు. దమ్ముంటే తమ సత్తా ఏంటో చూపిస్తాం.. రండి అంటూ మమత సవాల్ విసిరారు. మోదీకి సిందూర్ ఇవ్వడానికి భార్య లేదు అని, కాబట్టి అతనికి సిందూర్ విలువ తెలియదని చెప్పారు.
Mamata Banerjee: పహల్గాం ఉగ్రదాడి అనంతరం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను రాజకీయ లబ్ధికోసం కేంద్రంలోని బీజేపీ వినియోగించుకుంటుందని మమతా బెనర్జీ విమర్శించారు. వెంటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలరా? అని ప్రధానికి మమత సవాల్ విసిరారు.