Strait of Hormuz: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ విరమణ కుదరడంతో హోర్ముజ్ జలసంధి ప్రాధాన్యత మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఇరాన్ తన 90% చమురును ఈ మార్గం ద్వారానే ఎగుమతి చేస్తూ రోజుకు దాదాపు 139 మిలియన్ డాలర్లు (₹1,190 కోట్లు) సంపాదిస్తోంది. చాబహార్ పోర్ట్ ఉన్నా ఆయిల్ ఎగుమతులకు మౌలిక సదుపాయాలు లేకపోవడంతో హోర్ముజ్ ఇరాన్‌కు ఆర్థిక జీవనరేఖగా మారింది. దీనిపై ఆధారపడే భారత్ వంటి దేశాలపై కూడా ఇక్కడి ఉద్రిక్తతల ప్రభావం పడుతుంది.
మరింత Strait of Hormuz: ఇరాన్-అమెరికా యుద్ధానికి ఎండ్ కార్డ్..‘హోర్ముజ్ జలసంధి’ నుండి రోజుకు ₹1,190 కోట్ల ఆయిల్ సంపాదన!Author: MAHAA News Desk
Telangana Rains: రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్‌తో పాటు ఆ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!
Telangana Rains: తెలంగాణలో రాబోయే రెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు 60-80 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాలకు ఆరెంజ్, వరంగల్, సిద్దిపేట వైపు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ప్రయాణికులు, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
మరింత Telangana Rains: రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్‌తో పాటు ఆ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!Phone Tapping Case: మంత్రి తుమ్మల నివాసానికి పోలీసులు.. సాక్షిగా కీలక వాంగ్మూలం నమోదు!
Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. 2023 ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన పోలీసులు, శనివారం ఆయన నివాసంలో సాక్షిగా వాంగ్మూలం తీసుకున్నారు. సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను విచారించగా, తాజా పరిణామం పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మరింత Phone Tapping Case: మంత్రి తుమ్మల నివాసానికి పోలీసులు.. సాక్షిగా కీలక వాంగ్మూలం నమోదు!Religion: శివ అనుగ్రహం కోసం కఠిన తపస్సులు అవసరమా?
Religion: పరమశివుని అనుగ్రహం కోసం కఠినమైన పూజలు అవసరం లేదు, కేవలం పవిత్రమైన భక్తి ఉంటే చాలు. శివపురాణం ప్రకారం శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవన, అర్చన, వందన, దాస్య, సఖ్య, ఆత్మనివేదన అనే 9 రకాల భక్తులు మనిషిని ఈశ్వరుడికి దగ్గర చేస్తాయి. ఒక లోటా జలంతో తృప్తి పడే ఆ భోళా నాథుడిని ఈ నవవిధ భక్తుల ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
మరింత Religion: శివ అనుగ్రహం కోసం కఠిన తపస్సులు అవసరమా?Kesineni Nani: ఈడీకి లేఖ రాయడంతో ముదిరిన వివాదం.. ఎంపీ కేశినేని చిన్ని ఫిర్యాదుతో యాక్షన్!
Kesineni Nani: ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేస్తూ మాజీ ఎంపీ కేశినేని నాని ఈడీకి లేఖ రాయడం, ఉర్సా క్లస్టర్స్ అంశంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడంతో విజయవాడ కేశినేని బ్రదర్స్ వివాదం ముదిరింది. లీగల్ నోటీసులు ఇచ్చినా దుష్ప్రచారం ఆపలేదంటూ చిన్ని ఇచ్చిన ఫిర్యాదుతో నానిపై పోలీసులు BNS, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
మరింత Kesineni Nani: ఈడీకి లేఖ రాయడంతో ముదిరిన వివాదం.. ఎంపీ కేశినేని చిన్ని ఫిర్యాదుతో యాక్షన్!Karuppu: థియేటర్ లో మిస్.. OTT లో దొరికిపోయిన కరుప్పు..!
Karuppu: సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. ఓటీటీలోకి వచ్చాక ఇందులోని యాక్షన్ సీన్లలో వాడిన నాసిరకం వీఎఫ్ఎక్స్ ‘ఫేస్-స్వాపింగ్’ టెక్నాలజీ కారణంగా నెటిజన్ల నుండి విమర్శలు మరియు ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది.
మరింత Karuppu: థియేటర్ లో మిస్.. OTT లో దొరికిపోయిన కరుప్పు..!OG-2: కోసం పవన్ కళ్యాణ్ మార్చుకోవాల్సిన వ్యూహాలు..
OG-2: సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ చిత్రానికి సీక్వెల్ (‘OG 2’) కథా చర్చలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అయితే, మొదటి భాగం లాగా కాకుండా.. డిప్యూటీ సీఎంగా తన రాజకీయ బాధ్యతలను చూసుకుంటూనే, ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ నిరంతరాయంగా డేట్స్ కేటాయిస్తే.. సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరింత OG-2: కోసం పవన్ కళ్యాణ్ మార్చుకోవాల్సిన వ్యూహాలు..AN-32 Aircraft Crashes: కుప్పకూలిన AN-32 విమానం.. పైలట్ మృతి
AN-32 Aircraft Crashes: అస్సాంలోని జోర్హాట్ రౌరియా ఎయిర్‌బేస్‌లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలు కాగా, పైలట్ మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. సైనిక సరఫరాల కోసం వాడే ఈ సోవియట్ కాలపు విమాన ప్రమాద స్థలంలో ప్రస్తుతం ఆర్మీ గ్రౌండ్ సిబ్బంది సహాయక చర్యలు, అగ్నిమాపక పనులు చేపడుతున్నారు.
మరింత AN-32 Aircraft Crashes: కుప్పకూలిన AN-32 విమానం.. పైలట్ మృతిBhopal: పాకిస్తాన్‌తో సంబంధాలున్న యువకుడి అరెస్ట్.. ఉగ్రవాద కంటెంట్ ప్రచారం!
Bhopal: మధ్యప్రదేశ్ ఏటీఎస్ భోపాల్‌లో మహమ్మద్ ఫరాజ్ అనే యువకుడిని ఉపా (UAPA) చట్టం కింద అరెస్ట్ చేసింది. అతని మొబైల్ నుండి పాకిస్తాన్ పంపిన ఉగ్రవాద డిజిటల్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శిక్షణకు సిద్ధమవుతున్న ఈ నిందితుడు మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడని, అతని విదేశీ కనెక్షన్లపై ఏటీఎస్ అధికారులు ముమ్మర విచారణ జరుపుతున్నారని సమాచారం.
మరింత Bhopal: పాకిస్తాన్‌తో సంబంధాలున్న యువకుడి అరెస్ట్.. ఉగ్రవాద కంటెంట్ ప్రచారం!Health Tips: ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకే మెలకువ వస్తోందా?
Health Tips: రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేవడం వెనుక సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ఆధ్యాత్మిక కారణాల కంటే శారీరక కారణాలే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి పెంచే కార్టిసాల్ హార్మోన్, స్లీప్ అప్నియా, యాసిడ్ రిఫ్లక్స్ లేదా పడుకునే ముందు ఫోన్లు చూడటం వంటి అలవాట్లు నిద్రకు భంగం కలిగిస్తాయి. ఈ సమస్య తీవ్రంగా ఉంటే ఇంటర్నెట్ సమాచారాలపై ఆధారపడకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
మరింత Health Tips: ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకే మెలకువ వస్తోందా?