Mahesh Kumar Goud: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన 22ఏ భూముల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఏఐసీసీ అగ్రనేతలతో భేటీకి ముందు మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో భారీ ఎత్తున భూదోపిడీ జరిగిందని, ఆ పాపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో జరిగిన భూదోపిడీపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని, దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలా వద్దా అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయిస్తారని తేల్చిచెప్పారు.
నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ – పార్టీ బలోపేతం:
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పనుల వివరాలను ఏఐసీసీ అధిష్ఠానానికి నివేదిస్తానని, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన వివరించారు.
