IRCTC New Website

IRCTC తత్కాల్ బుకింగ్‌కు కొత్త వెబ్‌సైట్.. జూలై 15 లోపు ప్రయాణికులు ఈ 3 పనులు చేయడం మర్చిపోవద్దు!

IRCTC New Website: ఐఆర్‌సీటీసీ తత్కాల్ సాంకేతిక సమస్యలపై జైపూర్ విద్యార్థుల ఫిర్యాదుతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ జూలై 15 నాటికి కొత్త వెబ్‌సైట్ తేవాలని ఆదేశించారు. కొత్త సైట్ వచ్చే లోపు ప్రయాణికులు తమ ఐడీ, పాస్‌వర్డ్‌లను భద్రపరుచుకోవాలని, జూలై 15 పరిసరాల్లో జర్నీలు ఉంటే ముందే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత IRCTC తత్కాల్ బుకింగ్‌కు కొత్త వెబ్‌సైట్.. జూలై 15 లోపు ప్రయాణికులు ఈ 3 పనులు చేయడం మర్చిపోవద్దు!
Telangana High Court

Telangana High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్.. భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పు.. సీజే రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశం!

Telangana High Court: ఒక కేసు విచారణలో సకాలంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా కాలయాపన చేసినందుకు గాను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు రూ. 50 వేల జరిమానా విధించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కోర్టు ఆదేశాల విషయంలో నిర్లక్ష్యం వహించడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ జరిమానా మొత్తాన్ని హైకోర్టు సీజే రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశించడంతో ఈ పరిణామం అధికారుల వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత Telangana High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్.. భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పు.. సీజే రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశం!
TG:

TG: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల

TG: తెలంగాణ ఐసెట్ ఫలితాలను హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. మే 13, 14 తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం ఈ పరీక్ష జరిగింది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్ నుండి తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

మరింత TG: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
Garuda Puranam

Garuda Purana: మనిషి చేసే పాపాలు.. అనుభవించే 36 రకాల భయంకర నరకాలు ఇవే!

Garuda Purana: గరుడ పురాణంలో మనిషి చేసే తప్పులను బట్టి యమలోకంలో లభించే 36 రకాల నరకాల గురించి వివరించారు. గోహత్య, భూకబ్జాలు, తప్పుడు సాక్ష్యాలు, కన్నవారిని వేధించడం, వ్యాపారంలో కల్తీలు చేయడం, తోటివారిని మోసం చేయడం వంటి పాపాలు చేసిన వారికి మహావీచి, కుంభీపాకం, రౌరవం, తైలపాకం వంటి నరకాలలో మరిగే నూనె, ఇనుప బాణాలు, జలగలు, రంపాలతో కఠినమైన శిక్షలు ఉంటాయని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.

మరింత Garuda Purana: మనిషి చేసే పాపాలు.. అనుభవించే 36 రకాల భయంకర నరకాలు ఇవే!
Elon Musk First Trillionaire:

Elon Musk First Trillionaire: ప్రపంచంలోనే తొలి ‘ట్రిలియనీర్’గా ఎలాన్ మస్క్

Elon Musk First Trillionaire: స్పేస్‌ఎక్స్ కంపెనీ రికార్డు స్థాయి 75 బిలియన్ డాలర్ల ఐపీఓతో ఎలాన్ మస్క్ 1.1 ట్రిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా నిలిచారు. ఆయన సంపద తైవాన్ దేశ జీడీపీ కంటే ఎక్కువ, మరియు భారత దేశ జీడీపీలో నాలుగో వంతుకు సమానం. టెస్లా, ఎక్స్ (ట్విట్టర్), న్యూరాలింక్ వంటి సంస్థలతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రభావం చూపుతున్న మస్క్.. ఆధునిక చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా సరికొత్త మైలురాయిని అందుకున్నారు.

మరింత Elon Musk First Trillionaire: ప్రపంచంలోనే తొలి ‘ట్రిలియనీర్’గా ఎలాన్ మస్క్
Kiran Abbavaram:

Kiran Abbavaram: దర్శకుడిగా మారుతున్న కిరణ్ అబ్బవరం.. హీరో ఎవరో తెలుసా..?

Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే రాసి దర్శకత్వం వహిస్తున్న ‘#KA13’ చిత్రం హైదరాబాద్‌లో గ్రాండ్ గా లాంచ్ అయి, మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించుకుంది. కిరణ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో దేవిక భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శరత్ కుమార్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

మరింత Kiran Abbavaram: దర్శకుడిగా మారుతున్న కిరణ్ అబ్బవరం.. హీరో ఎవరో తెలుసా..?
Jaishankar:

Jaishankar: మీ ఆయుధాలు భారత్‌పై దాడికి వాడారు.. రష్యా ఆయిల్ కొనుగోలుపై మాకు నీతులు చెప్పొద్దు!

Jaishankar: రష్యా నుండి ఆయిల్ కొనడాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ సమర్థించారు. ఆయిల్ మార్కెట్ స్థిరత్వం కోసం రష్యా ఆయిల్ కొనమని 2022లో అమెరికానే భారత్‌ను కోరిందని చెప్పారు. యూరప్ దేశాల ఆయుధాలు పాకిస్తాన్ చేతికి చిక్కి భారత్‌పై దాడులకు (ఉదాహరణకు 1971లో ఐఎన్ఎస్ ఖుక్రీ నౌకను ముంచడం) ఉపయోగపడ్డాయని గుర్తు చేస్తూ.. భారత్‌ను విమర్శించే హక్కు పాశ్చాత్య దేశాలకు లేదని జైశంకర్ తేల్చిచెప్పారు.

మరింత Jaishankar: మీ ఆయుధాలు భారత్‌పై దాడికి వాడారు.. రష్యా ఆయిల్ కొనుగోలుపై మాకు నీతులు చెప్పొద్దు!
Meenakshi Natarajan:

Meenakshi Natarajan: ఎన్నికల సంఘం తీరుపై నమ్మకం లేదు.. సుప్రీంపై మాట్లాడను

Meenakshi Natarajan: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల ప్రక్రియ మధ్యలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని, ఎన్నికల తర్వాత ‘ఎన్నికల పిటిషన్’ వేసుకోవడమే మార్గమని స్పష్టం చేసింది. ఫామ్ 26 లో ప్రైవేట్ కేసు దాచారనే కారణంతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురికాగా, తాను ఏ సమాచారమూ దాచలేదని నటరాజన్ స్పష్టం చేస్తూ.. ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించిందని ఆరోపించారు.

మరింత Meenakshi Natarajan: ఎన్నికల సంఘం తీరుపై నమ్మకం లేదు.. సుప్రీంపై మాట్లాడను
Chandrababu

Chandrababu: అమరావతిని ఎవరూ ఆపలేరు.. చర్చకు మేం సిద్ధం!

Chandrababu: కూటమి రెండేళ్ల పాలన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ఐదేళ్ల విధ్వంస పాలన వల్ల కుప్పకూలిన వ్యవస్థలను తాము బాగు చేస్తున్నామన్నారు. తిరుమలను అపవిత్రం చేసిన వారు అనుభవిస్తారన్నారు. రాయలసీమను రూ. లక్ష కోట్లతో బంగారు సీమగా మారుస్తామని.. పుట్టపర్తిలో 5th జనరేషన్ ఫైటర్ జెట్ ప్లాంట్, తిరుపతిలో రూ. 2,500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఫ్యాక్టరీ వస్తున్నాయని ప్రకటించారు. వచ్చే నెలలో సీమ స్టీల్ ప్లాంట్ తెరుస్తామన్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, 15,700 పోస్టుల డీఎస్సీ పూర్తి చేశామని స్పష్టం చేస్తూ.. హామీల అమలుపై వైసీపీతో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.

మరింత Chandrababu: అమరావతిని ఎవరూ ఆపలేరు.. చర్చకు మేం సిద్ధం!
Pawan Kalyan

Pawan Kalyan: కూటమి కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది

Pawan Kalyan: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నాడు తాను 21 సీట్లు తీసుకున్నానని, కూటమి కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్పారు. రాష్ట్రం కులాల పరిమితులు దాటి భారతీయత వైపు వెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే, దేశ ప్రగతి గ్రామాల్లోనే నిర్ణయించబడుతుందని, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి, ఇచ్చిన ప్రతి హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

మరింత Pawan Kalyan: కూటమి కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది