Mythri Movie Makers

Mythri Movie Makers: మైత్రి బ్యానర్‌లో మరో బీటౌన్ స్టార్!

Mythri Movie Makers: టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు బాలీవుడ్‌లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్‌తో ‘జాట్’ సినిమాతో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ బ్యానర్.. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో హడావిడి చేయనుంది. ఈ సినిమా విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సన్నీ డియోల్ నటిస్తున్న ‘జాట్’ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే, ఇదే సమయంలో మైత్రి బ్యానర్‌లో మరో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు బిగ్ బజ్ వినిపిస్తోంది.టాలీవుడ్ డైరెక్టర్ బాబీ ఓ సాలిడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయగా.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. బాబీ ఇప్పటికే హృతిక్‌తో సమావేశమై కథను వినిపించగా, ఈ భారీ ప్రాజెక్ట్‌కు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనుందట. ప్రస్తుతం హృతిక్.. ఎన్టీఆర్‌తో ‘వార్-2’లో బిజీగా ఉన్నప్పటికీ, ఈ కొత్త సినిమా టాలీవుడ్-బాలీవుడ్ ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. నిజంగా హృతిక్ టాలీవుడ్ దర్శకుడితో సినిమా చేస్తాడా? ఈ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Venu Yeldandi: తేజ తో ‘బలగం’ వేణు రెండో సినిమా!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *