Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అది కూడా యువ దర్శకులతో ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం వశిష్ఠతో భారీ సినిమా “విశ్వంభర” సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ నుంచి శ్రీకాంత్ ఓదెల, అనీల్ రావిపూడి సినిమాలు ఉన్నాయి. అయితే మెగాస్టార్ తో అనీల్ చేయబోయే సినిమాపై ప్రస్తుతం అంచనాలు పెరిగాయి. ఎందుకంటే అనిల్ వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లకు పైగా వసూలు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో చిరుతో కూడా ఒక సాలిడ్ ఎంటర్టైనర్ ని చెయ్యనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాని కొంచెం అప్డేటెడ్ వెర్షన్ కామెడీతో ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. అలాగే చిరు మార్క్ ఎక్కడా మిస్ కాకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇది మాత్రమే కాకుండా ఈ సినిమా ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేసి ముగించేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో డెఫినెట్ గా నిలిపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. దీనితో ఈ క్రేజీ కలయికపై అంచనాలు పెరిగాయి.