Ghibli Trends: సోషల్ మీడియాలో ఇప్పుడంతా గిబ్లీ ట్రెండ్ నడుస్తోంది. దాదాపుగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఈ గిబ్లీ ట్రెండ్‌ని ఫాలో అవుతూ.. గిబ్లీఫైడ్ ప్రపంచంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు తనను తాను అప్ డేట్ చేసుకోవడమే కాకుండా… ఆ టెక్నాలజీని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ అదినేత, ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ గిబ్లీ ట్రెండ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అసలు ఏమిటీ గిబ్లీ ట్రెండ్. టేక్ ఎ లుక్.
జపాన్‌కు చెందిన ప్రఖ్యాత యానిమేషన్ స్టూడియో “స్టూడియో గిబ్లీ”. ఆ స్టూడియో రూపొందించే విభిన్నమైన, కళాత్మకమైన యానిమేషన్ చిత్రాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఇదొక ట్రెండ్‌గా మారిపోయింది. ఇప్పుడు కామన్ నెటిజన్ల నుండి ప్రముఖల వరకూ అంతా తమ ఫొటోలను గిబ్లీ శైలిలో మార్చి పోస్ట్ చేస్తున్నారు. ఇది ఒక ఫన్ అండ్ క్రియేటివ్ ట్రెండ్‌గా మారిపోయింది. ఇక దేశంలోని రాజకీయ నాయకుల్లో ప్రధాని మోడీ అయితే ఈ ట్రెండ్‌ని ఎప్పుడో అందిపుచ్చుకున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన మోడీ గిబ్లిఫైడ్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఇక ఈ ట్రెండ్‌లోకి కాస్త లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్టుగా ఎంట్రీ ఇచ్చింది నారా ఫ్యామిలీ. సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌లు తమ అఫీషియల్ ఎక్స్ ఖాతాల్లో పోస్ట్ చేసిన గిబ్లిఫైడ్ ఫొటోల గురించే ఇప్పుడు నెట్టింట అంతా మాట్లాడుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Home Minister Anita: క్యాన్సర్ పెషేంట్‌కు అండగా హోంమంత్రి.. వీడియో కాల్ మాట్లాడిన అనిత
చంద్రబాబు ఏడు పదుల వయసు దాటినా టెక్నాలజీ పట్ల హుషారుగా ఉంటారు. ఎప్పుడు కొత్త అంశాలను నేర్చుకునేందుకు ముందుంటారు. అటు పాలనలోనే కాక, టెక్నాలజీ, సోషల్ మీడియా ట్రెండ్స్‌లో చురుకుగా పాల్గొనడం.. ఆయనలోని నేర్చుకునే ఆసక్తిని, ఆధునికతను అందిపుచ్చుకునే తత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఇక చంద్రబాబు పోస్ట్ చేసిన తన గిబ్లీఫైడ్ ఫొటోలలో పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీలతో కలిసి ఉన్న ఫొటో విపరీతంగా ఆకట్టుకుంటోంది. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆయన ఎన్డీఏ కూటమి పార్టీల పట్ల, సభ్యుల పట్ల చూపే గౌరవాన్ని ఈ ఫొటో సూచిస్తోంది. ఇది TDP, జనసేన, బీజేపీ మధ్య సమన్వయాన్ని ప్రతిబింబిస్తూ, కూటమి ఐక్యతను బలపరిచే సంకేతంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండో చిత్రంలో తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోను, మూడో చిత్రంలో బెజవాడ వదరల్లో మోకాళ్ల లోతు నిళ్లలో దిగి ముంపు బాధితుల వద్దకు వెళ్లి పరామర్శిస్తున్న ఫొటోను పంచుకున్నారు.
అటు చంద్రబాబుతో పాటు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ట్రెండ్‌లో చేరిపోయారు. తన తండ్రి కంటే కాస్త ముందుగానే గిబ్లీఫైడ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన లోకేశ్… మూడు చిత్రాలను పోస్ట్ చేశారు. మొదటిది భార్య, కుమారుడితో కలిసి ఉన్న కుటుంబ ఫొటో కాగా, మిగతా రెండు చిత్రాలను ప్రజలు, టీడీపీ శ్రేణులతో మమేకమైనట్లుగా చిత్రీకరించారు. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ ఒకే రోజు కొన్ని నిమిషాల వ్యవధిలో ఈ ట్రెండ్‌లో చేరడం టీడీపీ అభిమానులను ఉత్సాహపరుస్తోంది.
Beta feature
Beta feature
Beta feature