Viral News: కొందరు వీడియోలు మరియు రీల్స్ చేయడానికి ప్రమాదకరమైన విన్యాసాలు(stunts) చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఓ యువకుడు కూడా కొండపైకి ప్రాక్టీస్ చేసేందుకు వెళ్లి బ్యాక్‌ఫ్లిప్ చేస్తుండగా పక్కనే వున్నా లోయలో పడిపోయాడు. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి రీల్స్ చేసే వారు ఎన్నో విన్యాసాలు చేస్తుంటారు. విచిత్ర విన్యాసాలు చేస్తూ ప్రాణాలను పణంగా పెట్టిన వారూ ఉన్నారు. ఇలా ట్రెండ్ ఫాలో అవుతూ లేక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేదాం అని ప్రాణాలకు తెగించి రెల్స్ చేస్తున్న వాళ్ళని మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అలాంటి సంఘటనే జరిగింది, ఒక యువకుడు రీల్స్ కోసం కొండపై నిలబడి ప్రాక్టీస్ చేయడానికి వెళ్లి, బ్యాక్‌ఫ్లిప్ చేస్తూ, అతను సరాసరి లోయలో పడిపోయాడు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విన్యాసాలు, రకరకాల వ్యాయామాలు చేస్తూ తమను తాము పణంగా పెట్టే వారు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ఓ యువకుడు కూడా స్టైల్‌గా బ్యాక్‌ఫ్లిప్ చేసేందుకు వెళ్లి కొండపై నుంచి కింద పడిపోయాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న సమాచారం ఇంకా అందుబాటులో లేదు.
ఇది కూడా చదవండి: Viral News: ప్రియుడితో జంప్ అవబోయిన కానిస్టేబుల్.. అసలు ట్విస్ట్ ఇదే!
Viral News: దీనికి సంబంధించి ‘’CCTV IDIOTS’’ పేరుతో ఉన్న X ఖాతాలో “మరో యువకుడు ఈ ఇడియట్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు” అనే క్యాప్షన్‌తో ఒక పోస్ట్ షేర్ చేయబడింది. వైరల్ వీడియోలో, ఒక యువకుడు బ్యాక్‌ఫ్లిప్ చేయడం చూడవచ్చు. ఈ కసరత్తు చేస్తుండగా అదుపుతప్పి కొండపై నుంచి కింద పడిపోయాడు. అక్కడే ఉన్న యువకుడు పట్టుకునేందుకు ప్రయత్నించినా కాపాడలేకపోయాడు.
ఈ మధ్యాహ్నం షేర్ చేసిన వీడియోకి 1 లక్షకు పైగా వీక్షణలు మరియు అనేక వ్యాఖ్యలు వచ్చాయి. ఒక వినియోగదారు ఇలా అన్నాడు, “అతను పడిన దెబ్బకి అతని ఎముకలు విరిగి ఉండాలి. మరో వినియోగదారు, “వీడియో కోసం ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం ఉందా?” అని ప్రశ్నించారు. మరో వినియోగదారు, “అతను ఉద్దేశపూర్వకంగా ముందుకు పరుగెత్తి కొండ కింద పడినట్లుగా ఉంది” అని వ్యాఖ్యానించారు.
the other guy tried to catch the idiot 🤣😂 pic.twitter.com/GhSc2tL7wu
— CCTV IDIOTS (@cctvidiots) October 31, 2024