IAS Transfers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్పులు పరిపాలనలో చురుకుదనం తీసుకురావడంతో పాటు, అభివృద్ధి పనులు వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.
🔹 పార్వతీపురం మన్యం జిల్లా కొత్త కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి నియమితులయ్యారు.
🔹 విజయనగరం జిల్లా కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.
🔹 తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా కీర్తి చేకూరు నియమితులయ్యారు.
🔹 గుంటూరు జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా నియమితులయ్యారు.
🔹 పల్నాడు జిల్లా కలెక్టర్‌గా కృతిక శుక్లా నియమితులయ్యారు.
🔹 బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వినోద్‌కుమార్ నియమితులయ్యారు.
🔹 ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజాబాబు నియమితులయ్యారు.
🔹 నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా బాధ్యతలు చేపట్టనున్నారు.
🔹 అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా నిషాంత్‌కుమార్ నియమితులయ్యారు.
🔹 కర్నూలు జిల్లా కలెక్టర్‌గా ఎ. సిరి నియమితులయ్యారు.
🔹 అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఆనంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
🔹 శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా శ్యామ్‌ప్రసాద్ నియమితులయ్యారు.
ప్రభుత్వం ఈ బదిలీలను తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. జిల్లాల అభివృద్ధి, ప్రజా సేవలు, శాంతి భద్రతల పరిరక్షణలో కొత్త కలెక్టర్లు మరింత సమర్థత చూపాలనే అంచనాలు ఉన్నాయి.