Virat Kohli

Virat Kohli: 14 సంవత్సరాలలో మొదటిసారి; కోహ్లీ కెరీర్‌లో చెత్త రికార్డు

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటన అతని కెరీర్‌లో అత్యంత చెత్త పర్యటన. 5 మ్యాచ్‌ల్లో కేవలం 190 పరుగులు చేశాడు, ఇది అతని మునుపటి పర్యటనలతో పోలిస్తే చాలా తక్కువ. పెర్త్‌లో సెంచరీ మినహా మిగిలిన ఇన్నింగ్స్‌లో కోహ్లి ప్రదర్శన నిరాశపరిచింది. టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో చివరి ఇన్నింగ్స్‌లో కూడా ప్రత్యేక ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనూ విరాట్ కోహ్లీ మరో తప్పిదం చేసి వికెట్ తో పెవిలియన్ చేరాడు. దీంతో ఈ ఆస్ట్రేలియా పర్యటనను విరాట్ నిరాశాజనక ప్రదర్శనతో ముగించాడు. విరాట్‌కి ఇది ఐదో ఆస్ట్రేలియా పర్యటన కాగా గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టులో సంచలనం సృష్టించిన అతని బ్యాటింగ్ ఈసారి పూర్తిగా సైలెంట్‌గా మారింది. గత 4 టూర్లతో పోలిస్తే ఈ ఆస్ట్రేలియా టూర్ ఇప్పటివరకు కోహ్లీకి అత్యంత చెత్త రికార్డులు,జ్ఞాపకాలు మిగిల్చింది.

ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 190 పరుగులు

Virat Kohli: సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీని స్కాట్ బోలాండ్ 6 పరుగుల వద్ద స్లిప్ లో స్టీవ్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియన్ టూర్‌ను ప్రారంభించిన విధంగానే ముగించాడు. సిడ్నీ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విరాట్ కేవలం 23 పరుగులే చేయగలిగాడు. మొత్తం సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 9 ఇన్నింగ్స్‌ల్లో 190 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో సెంచరీ కూడా ఉంది, పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ సెంచరీ మినహా మిగిలిన 8 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు.

ఇది కూడా చదవండి: Delhi politics: ఢిల్లీ ఎన్నిక‌ల‌కు బీజేపీ తొలి జాబితా విడుద‌ల‌.. కేజ్రీవాల్‌పై పోటీ చేసేది ఆయ‌నే?

గత పర్యటనల్లో కోహ్లి ప్రదర్శన

Virat Kohli: విరాట్ కోహ్లీ 2011లో తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. ఆ పర్యటనలో కోహ్లీ బ్యాట్‌తో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ సాధించాడు. దీని తర్వాత 2014లో రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా వచ్చిన విరాట్ తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాడు. ఈ సమయంలో, విరాట్ నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు మరియు ఒక అర్ధ సెంచరీ సహాయంతో 692 పరుగులు చేశాడు. ఈ పర్యటనలో అతని సగటు 86.50.

Virat Kohli: ఆ తర్వాత 2018 ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి ఒక సెంచరీఅలానే ఒక  హాఫ్ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాలో తన నాలుగో పర్యటనలో, విరాట్ కేవలం మూడు ఇన్నింగ్స్‌లలోకేవలం ఒక అర్ధ సెంచరీని సాధించాడు. మొత్తంగా, 2011-12 నుండి 2020-21 పర్యటన వరకు, విరాట్ 13 మ్యాచ్‌లలో 54.08 అత్యుత్తమ సగటుతో 1352 పరుగులు చేశాడు. అయితే, 2024-25 ఆస్ట్రేలియా పర్యటన విరాట్‌కు అత్యంత చెత్తగా అలానే మరచిపోలేనిది. కాగా, ఈ ఆస్ట్రేలియా పర్యటన మాత్రమే కాకుండా 2024 సంవత్సరం కూడా విరాట్‌కు మరిచిపోలేనిది. ఎందుకంటే కోహ్లి ఈ ఏడాది ఆడిన 19 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో 417 పరుగులు మాత్రమే చేశాడు. గతేడాది టెస్టుల్లో కోహ్లి సగటు 25 కంటే తక్కువ.

ALSO READ  IPL 2025 Retentions: ఐపీఎల్‌ 2025 రిటెన్షన్‌ జాబితా విడుదల..

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *